Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త సినిమాకి తీసుకెళ్లడానికి ‘నో’ చెప్పాడని భార్య ఆత్మహత్య

Telangana: భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న చిన్న గొడవలను సర్దుకుని సరదాగా ఉండేవారు కొందరు.. మరికొందరు క్షణికావేశంలో తమ జీవితాన్ని త్యాగం చేసుకునేవారు ఇంకొందరు. భర్త భర్తల మధ్య ప్రేమ..

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త సినిమాకి తీసుకెళ్లడానికి 'నో' చెప్పాడని భార్య ఆత్మహత్య
Wife Sucide
Follow us
Surya Kala

|

Updated on: May 06, 2022 | 10:35 AM

Telangana: భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న చిన్న గొడవలను సర్దుకుని సరదాగా ఉండేవారు కొందరు.. మరికొందరు క్షణికావేశంలో తమ జీవితాన్ని త్యాగం చేసుకునేవారు ఇంకొందరు. భర్త భర్తల మధ్య ప్రేమ, అలక సర్వసాధారణం.. అది ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు చేసిన పెళ్లి అయినా సరే.. తాజాగా ఓ భార్య.. తన భర్తను సినిమాకు తీసుకుని వెళ్ళమని అడిగింది. అయితే భర్త సినిమాకి తీసుకుని వెళ్ళమని అడిగితే వెంటనే తీసుకెళ్లకపోవడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా(Rangareddy District) శంకరపల్లి (Shankarpalli) గురువారం చోటుచేసుకుంది.

శంకరపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా సంగెం గ్రామానికి చెందిన రాజు, స్వాతి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరిలో వివాహం జరిగింది. కొద్దిరోజుల తర్వాత పెద్దలను ఒప్పించారు. ఈక్రమం రాజు శంకరపల్లిలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం స్థానిక భవానీనగర్‌లో గది అద్దెకు తీసుకుని స్వాతిని కూడా తీసుకొచ్చాడు. వేరు కాపురం పెట్టారు.

అయితే బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు తీసుకుని వెళ్ళమని భర్తని స్వాతి కోరింది. అయితే రాజు ఈరోజు వద్దు.. రేపు వెళ్దామని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన స్వాతి గురువారం రాజు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు శంకర్‌పల్లి ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మీడియాకు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Anakapalle: అనకాపల్లి జిల్లాలో దారుణం.. 6 ఏళ్ల బాలికపై ఉన్మాది అత్యాచారం..!

Viral Video: మనుషులకు ఏ మాత్రం తీసిపోమంటున్న కప్పలు.. తాము చూస్తుండగా సెల్ ఫోన్ తీస్తున్న వ్యక్తిపై దాడి..