AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేశారా? రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత వ్యంగాస్త్రాలు..

ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహల్ గాంధీ నేటి (మే6) నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం వరంగల్‌ జిల్లా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పాల్గొననున్నారు

MLC Kavitha: తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేశారా? రాహుల్ గాంధీ పర్యటనపై  ఎమ్మెల్సీ కవిత వ్యంగాస్త్రాలు..
Mlc Kavitha
Basha Shek
|

Updated on: May 06, 2022 | 9:56 AM

Share

ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహల్ గాంధీ నేటి (మే6) నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం వరంగల్‌ జిల్లా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే రాహుల్‌ పర్యటనపై అటు అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆయన పర్యటనతో తెలంగాణలో ఎలాంటి ప్రయోజనాలు ఉండవని విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha ) రాహుల్‌ గాంధీ పర్యటనపై వ్యంగాస్త్రాలు సంధించారు. ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ అగ్రనేతకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో సమాధానం చెప్పండి? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు , నిధుల గురించి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతున్నప్పుడు మీరెక్కడ ఉన్నారు’ అంటూ రాహుల్‌ను ప్రశ్నించారు కవిత.

కాగా తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని కవిత రాహుల్‌ను ప్రశ్నించారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు ? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరాతీసి అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి. సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు వాటిని అమలుచేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు కవిత.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IPL 2022: తగ్గేదేలే అంటోన్న డేవిడ్‌ భాయ్‌.. పాత జట్టుపై ప్రతీకారంతో పాటు ఆ ప్రపంచ రికార్డును కూడా ఖాతాలోకి వేసుకున్నాడుగా..

Gold & Silver Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్‌.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

DC vs SRH Live Score: దంచికొట్టిన వార్నర్‌.. దుమ్ములేపిన పావెల్‌.. సన్‌రైజర్స్‌ ముందు భారీ టార్గెట్..