Anakapalle: అనకాపల్లి జిల్లాలో దారుణం.. 6 ఏళ్ల బాలికపై ఉన్మాది అత్యాచారం..!

6 సంవత్సరాల వయసున్న అభం శుభం తెలియని చిన్నారిపై ఓ మానవ మృగం అత్యాచారం చేశాడు. బాలిక రోదిస్తున్నా వదలకుండా తన కామ వాంఛ తీర్చుకున్నాడు.

Anakapalle: అనకాపల్లి జిల్లాలో దారుణం.. 6 ఏళ్ల బాలికపై ఉన్మాది అత్యాచారం..!
Minor girl raped
Follow us
Ram Naramaneni

|

Updated on: May 06, 2022 | 10:19 AM

Andhra Pradesh:  కఠిన చట్టాలు తెస్తున్నా.. కీచకుల బుద్ది మారడం లేదు. మృగాళ్ల బారిన పడి.. అబలల జీవితాలు నాశనం అయిపోతూనే ఉన్నాయి. ఆడపిల్ల కనపడితే చెలరేగిపోతున్నారు కామాంధులు. చెరబట్టి.. జీవితం నాశనం చేస్తున్నారు. వావివరసలు లేవు.. వయసుతో సంబంధం లేదు. బెదిరింపులకు పాల్పడుతూ.. బ్రతుకులు చిదిమేస్తున్నారు. ప్రతి రోజూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.  తాజాగా  అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. పక్కింట్లో ఉంటున్న సాయి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక పేరెంట్స్ చెబుతున్నారు. రాత్రి 2గంటల సమయంలో అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లగా.. నిందితుడు బాలికను లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని మరో బాలిక పేరెంట్స్‌కు చెప్పగా.. వారు చుట్టుపక్కల వెతికారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. చికిత్స కోసం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

 బాలిక చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు… తల్లిదండ్రులను అడిగి ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడి గాలింపు కోసం మూడు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపారు. కేసును ఏఎస్పీ మణికంఠ పర్యవేక్షిస్తున్నారు.  ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read: Andhra Pradesh: మళ్లీ అదే వ్యధ.. బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి.. కన్నీటి పర్యంతం