Andhra Pradesh: మళ్లీ అదే వ్యధ.. బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి.. కన్నీటి పర్యంతం

ఏపీలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు లేక చిన్నారి మృతదేహాన్ని తండ్రి తన బైక్‌పైనే తీసుకెళ్లాడు.

Andhra Pradesh: మళ్లీ అదే వ్యధ.. బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి.. కన్నీటి పర్యంతం
Ap Tragedy
Follow us
Ram Naramaneni

|

Updated on: May 06, 2022 | 9:18 AM

అదే ఉమ్మడి నెల్లూరుజిల్లా…! మొన్న బాలుడు…ఇవాళ పాప..సేమ్‌ సిట్యువేషన్‌. అవును..కాలువలో పడి చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తీసుకురావడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తండ్రి బైక్‌పై తీసుకెళ్లిన ఘటన మరువకముందే నెల్లూరు జిల్లాలో మరో ఘటన కలకలం రేపుతోంది. దొరవారి సత్రం మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని సమీప చెరువులోని గ్రావెల్ కుంటలో ప్రమాదవశాత్తు రెండేళ్ల చిన్నారి అక్షయ పడిపోయింది. వెంటనే తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. ఈలోపే రెండేళ్ల చిన్నారి అక్షర మృతి చెందిందని వైద్యులు స్పష్టం చేశారు. మృతదేహం తరలించలేమని 108 వాహన సిబ్బంది స్పష్టం చేశారు. ఆస్పత్రి నుండి మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్‌ వాహనదారులు అధికమొత్తంలో డబ్బు డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేని ఆ చిన్నారి తండ్రి ఆస్పత్రి నుంచి సొంత గ్రామానికి బైక్‌పైనే పాప డెడ్‌బాడీ తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి నుంచి గ్రామానికి సుమారు 18 కిలోమీటర్లు బైక్‌పైనే కన్నకూతురు డెడ్‌బాడీని భుజంపై వేసుకొని తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. మీడియా వెళ్లి తండ్రిని ఆరా తీస్తే కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: Viral: వాయమ్మో..! ఎంత పిచ్చి ప్రేమ అమ్మాయ్.. లవర్ కోసం మరీ ఇలానా..?