Viral: వాయమ్మో..! ఎంత పిచ్చి ప్రేమ అమ్మాయ్.. లవర్ కోసం మరీ ఇలానా..?

వారిద్దరూ లవర్స్. ఘాడమైన ప్రేమలో ఉన్నారు. విలాసంగా బ్రతుకుతున్నారు. అయితే అందుకు డబ్బులు సరిపోవడం లేదు. దీంతో ఓ స్కెచ్ వేశారు.

Viral: వాయమ్మో..! ఎంత పిచ్చి ప్రేమ అమ్మాయ్.. లవర్ కోసం మరీ ఇలానా..?
Chain Snatching Lovers
Follow us
Ram Naramaneni

|

Updated on: May 04, 2022 | 9:34 AM

వారిద్దరూ లవర్స్. ఘాడమైన ప్రేమలో ఉన్నారు. విలాసంగా బ్రతుకుతున్నారు. అయితే అందుకు డబ్బులు సరిపోవడం లేదు. దీంతో ఓ స్కెచ్ వేశారు. ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌లు చేయాలని డిసైడయ్యారు. ప్లాన్ ప్రకారం రెచ్చిపోయారు. ప్రియురాలు బైక్​ నడుపుతూ అడ్రస్ అడుగుతుండగా.. ప్రియుడు చైన్‌లు తెంపుతాడు. అయితే ఎంతటి గజ దొంగలైనా పట్టుబడక మానరు. వీరింకా ఓనమాలు నేర్చుకునే దశలో ఉన్నారు. చిక్కకుండా ఎలా ఉంటారు. తమిళనాడు(Tamil Nadu) కోయంబత్తూరు(Coimbatore) పోలీసులు ఈ కన్నింగ్ లవర్స్‌ను తాజాగా అరెస్ట్ చేశారు. నిందితులను ప్రసాద్​(20), తేజస్విని(20) గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..కోయంబత్తూరులోని తొండముత్తూర్​ ఏరియాకు చెందిన కాలియమ్మాళ్​ అనే మహిళ ఏప్రిల్​ 28న చేనులో మేకను మేపుతోంది. స్కూటీపై వచ్చిన ఈ కిలాడీ కపుల్.. ఆ మహిళను ఏదో అడ్రస్ చెప్పాలన్నట్లు అడిగారు. ఆమె వారికి అడ్రస్​ చెప్తుండగా.. వెనుక కూర్చున్న ప్రసాద్​ ఒక్కసారిగా మహిళ మెడలోని చైన్ లాగేశాడు. అనంతరం వారిద్దరూ అక్కడినుంచి ఎస్కేప్ అయ్యారు. షాక్‌కు గురైన సదరు మహిళ.. లబోదిబోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను అరెస్ట్​ చేశారు.

నిందితులు పేరూర్​ పచ్చపాళ్యంలోని ఓ ప్రైవేట్​ కాలేజ్‌లో బీటెక్​ థర్డ్ ఇయర్ చదువుతున్నారని.. మూడేళ్లుగా లవ్ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఆన్​లైన్​ బెట్టింగ్​తో ప్రసాద్​ బాగా డబ్బులు పొగొట్టుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అప్పులు తీర్చేందుకే నిందితులు ఈ నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు. అంతకుముందు ప్రసాద్​ ఇంట్లోనే 30 సవర్ల గోల్డ్ పోయిందని.. దర్యాప్తులో ప్రసాద్​ దొంగలించాడని తేలడం వల్ల అతడి తండ్రి కేసును వాపస్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరిని జ్యుడిషియల్​ కస్టడీకి తరలించారు.

Also Read: AP: ఏపీకి విపత్తుల నిర్వహణ శాఖ పిడుగుల హెచ్చరిక.. ముఖ్యంగా ఆ జిల్లా ప్రజలకు అలెర్ట్