AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Denmark Visit: నేటితో ముగియనున్న ప్రధాని యూరప్ పర్యటన.. తొలిసారిగా డెన్మార్క్‌‌కు నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన నేటితో ముగియనుంది. ఈరోజు ఆయన పర్యటన చివరి రోజైన కొన్ని గంటలపాటు ఫ్రాన్స్‌లో గడవనుంది.

PM Modi Denmark Visit: నేటితో ముగియనున్న ప్రధాని యూరప్ పర్యటన.. తొలిసారిగా డెన్మార్క్‌‌కు నరేంద్ర మోదీ
Pm Modi
Balaraju Goud
|

Updated on: May 04, 2022 | 9:29 AM

Share

PM Modi Denmark Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన నేటితో ముగియనుంది. ఈరోజు ఆయన పర్యటన చివరి రోజైన కొన్ని గంటలపాటు ఫ్రాన్స్‌లో గడవనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. అంతకుముందు నరేంద్ర మోదీ మంగళవారం డెన్మార్క్‌లో పర్యటించారు. కోపెన్‌హాగన్‌లో డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్‌సెన్‌తో మోదీ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.

మంగళవారం, డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్‌సన్ అధికారిక నివాసానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటన గురించి విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. ఇద్దరు ప్రధానమంత్రులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై వివరంగా చర్చించారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై రసవత్తర చర్చ జరిగి.. ప్రకటన కూడా చేశారు. ఇది కాకుండా, భారతదేశం EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం వేగంగా పని చేయడానికి తమ నిబద్ధతను కూడా ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు.

భారత్ డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ పురోగతిని కూడా ఇరు దేశాల ప్రధానుల మధ్య సమీక్షించామని వినయ్ క్వాత్రా చెప్పారు. ఈ సందర్భంగా, పునరుత్పాదక శక్తి, ముఖ్యంగా పవన శక్తి, ఆఫ్‌షోర్ రంగంలో గ్రీన్ హైడ్రోజన్, అలాగే నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, షిప్పింగ్, నీరు, ఆర్కిటిక్ మొదలైన రంగాలలో సహకారం వంటి అంశాలు కూడా చర్చించారు. సంభాషణ అనంతరం డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్‌సెన్ నరేంద్ర మోదీని తన అధికారిక నివాసానికి తీసుకెళ్లి, చివరిసారిగా భారత్‌లో పర్యటించిన సందర్భంగా మోదీ ఇచ్చిన పెయింటింగ్‌ను ఆయనకు చూపించారు.

ప్రధాని మోదీ డెన్మార్క్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇక్కడ ప్రధానమంత్రి బుధవారం ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి ఇండియా డెన్మార్క్ బిజినెస్ రౌండ్ టేబుల్‌లో పాల్గొంటారు. డెన్మార్క్‌లో నివసిస్తున్న భారతీయ కుటుంబాలతో కూడా సమావేశమవుతారు. దాదాపు 16,000 మంది భారతీయ సంతతికి చెందిన వారు డెన్మార్క్‌లో నివసిస్తున్నారు. 60 కంటే ఎక్కువ భారతీయ కంపెనీలు డెన్మార్క్‌లో పనిచేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ఐటీ రంగంలోని కంపెనీలు ఉన్నాయి.

ఈరోజు, డెన్మార్క్‌లో ద్వైపాక్షిక చర్చలతో పాటు, డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, స్వీడన్, నార్వే ప్రధాన మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ రెండవ ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ అతను 2018లో జరిగిన మొదటి ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సమావేశం నుండి సహకారాన్ని సమీక్షించనున్నారు. ఈ సదస్సులో కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వాతావరణ మార్పులు, ఆవిష్కరణలు, సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ భద్రతా దృశ్యం, ఆర్కిటిక్ ప్రాంతంలో భారతదేశం నార్డిక్ సహకారం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఇతర నార్డిక్ దేశాల నాయకులను కలుస్తారు.

Read Also…  High Court: భారతీయ మహిళలు తమ భర్తను ఇతరులతో పంచుకోవాలనుకోరు.. అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు