AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani: ‘నేను రాహుల్ గాంధీని కాను..’ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మంగళవారంనాడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రాతినిథ్యంవహిస్తున్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించారు. వయనాడ్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె పెదవి విరిచారు.

Smriti Irani: ‘నేను రాహుల్ గాంధీని కాను..’ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Gandhi, Smriti Irani
Janardhan Veluru
|

Updated on: May 04, 2022 | 10:51 AM

Share

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మంగళవారంనాడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రాతినిథ్యంవహిస్తున్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించారు. వయనాడ్ (Wayanad) నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె పెదవి విరిచారు. ఇక్కడ పెద్దగా ఏమీ జరగలేదంటూ రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శనాస్త్రాలు సంధించారు. స్మృతి ఇరానీ వయనాడ్ పర్యటన ఇటు కేరళతో పాటు అటు జాతీయ స్థాయిలో రాజకీయ వేడి రాజేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనకు కంచుకోటలాంటి యూపీలోని అమేథీని వదులుకుని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు రాహుల్ గాంధీ. ఇప్పుడు వయనాడ్ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ పర్యటించడంతో.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థిని బరిలో నిలిపే యోచనలో బీజేపీ అధిష్టానం ఉందన్న ప్రచారం జరిగింది. స్మృతి ఇరానీయే వయనాడ్‌లో రాహుల్ గాంధీపై పోటీ చేసే అవకాశముందన్న ప్రచారం కూడా జరిగింది.

మీడియా కథనాలపై స్పందించిన బీజేపీ వర్గాలు.. స్మృతి ఇరానీ వయనాడ్‌లో పర్యటించడం వెనుక ఎలాంటి రాజకీయం లేదని స్పష్టంచేశాయి. తన మంత్రిత్వ శాఖ వ్యవహారాల నిమిత్తమే ఆమె అక్కడకు వెళ్లినట్లు వివరించాయి. వయనాడ్ పర్యటనలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. ‘నేను రాహుల్ గాంధీని కాదు.. అమేథీ నుంచి మరెక్కడికీ పారిపోను’ అన్నారు. పార్టీ ఆదేశిస్తే వయనాడ్ నుంచి పోటీ చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అటు మోడీ పాలనలో అమేథీ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటూ స్మృతి ఇరానీ ఓ వీడియోను ట్వీట్ చేశారు.

స్మృతి ఇరానీ వయనాడ్‌లో పర్యటించడం వెనుక రాజకీయం లేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది ఆసక్తికర పరిణామంగా మారింది. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ మధ్య సుదీర్ఘ ఎన్నికల రాజకీయ చరిత్ర నెలకొనడం విశేషం. తొలిసారిగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటున్న అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీని బీజేపీ బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఓడిపోయినా.. 2009 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి వచ్చిన 3.7 లక్షల ఓట్ల మెజార్టీని 1 లక్షకు తగ్గించారు స్మృతి ఇరానీ. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ‌ని స్మృతి ఓడించారు. అయితే 2019 ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. అక్కడి నుంచి విజయం సాధించారు. సీపీఐకి చెందిన పీపీ సునీర్‌పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీ (65.67 శాతం)తో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఎన్డీయే తరఫున బరిలో నిలిచిన తుషార్ వెళ్లపల్లికి కేవలం 6.22 శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుని డిపాజిట్ కోల్పోయారు.

కేరళలో బీజేపీ బలంగా లేదు. అయితే 2024 ఎన్నికల్లో వయనాడ్‌‌లో రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే స్మృతి ఇరానీ అక్కడ పర్యటించినట్లు భావిస్తున్నారు. స్మృతి ఇరానీ అక్కడి నుంచి పోటీ చేయకున్నా.. 2024 ఎన్నికల్లో అక్కడ ప్రచారానికి తప్పక వస్తారన్న ప్రచారం జరుగుతోంది.

మరిన్ని రాజకీయ వార్తలు ఇక్కడ చదవండి..

Also Read..

Jayamma Panchayathi: మహేష్ బాబు చేతుల మీదుగా జయమ్మ పంచాయతీ ట్రైలర్.. ఈసారి మరింత ఆసక్తికరంగా..

Chandrababu Naidu: టార్గెట్ 2024 దిశగా చంద్రబాబు తొలి అడుగు వేస్తున్నారా..?