Chandrababu Naidu: టార్గెట్ 2024 దిశగా చంద్రబాబు తొలి అడుగు వేస్తున్నారా..?
ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ 2024 ఎన్నికలే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇవాళ చంద్రబాబు జిల్లాల టూర్ ప్రారంభం కానుంది.
TDP President Chandrababu Naidu District Tour: ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ 2024 ఎన్నికలే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇవాళ చంద్రబాబు జిల్లాల టూర్ ప్రారంభం కానుంది. దీంతో టార్గెట్ 2024 దిశగా చంద్రబాబు తొలి అడుగు వేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. కాగా, ఇప్పటికే అధికార వైసీపీ ప్రత్యేకంగా సమవేశాలు నిర్వహిస్తూ, ఎన్నికలకు రెడీ అవుతోంది. వైసీపీ నేతలకు సీఎం జగన్ పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. నేతలకు ఆదరణ ఉంటేనే టికెట్ అంటూ స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం చేపడుతున్నారు నేతలు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ కోసం గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే రైతు భరోసా పేరుతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ పార్టీల కార్యక్రమాలతో అలెర్ట్ అయ్యింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇతర పార్టీ అధినేతల కంటే ముందుగానే జనం బాట పడుతున్నారు చంద్రబాబు. అయితే, ఇంత సడెన్‌గా బాబు జిల్లాల టూర్ చేపట్డానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి చంద్రబాబు జిల్లాల టూర్ ప్రారంభం అవుతోంది. తనకు బాగా సెంటిమెంట్ అయిన సిక్కోలు నుంచే ఆయన తన పర్యటనను ప్రారంభించడం విశేషం.
మొన్ననే చంద్రబాబు జిల్లాల పర్యటనల షెడ్యూల్‌ను విడుదల చేసింది టీడీపీ. ఇటీవల తెలుగుదేశం నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా, మొదట శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చేపట్టే కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. భీమిలి నియోజవర్గం తాళ్లవలసలో రేపు, ముమ్మడివరం నియోజవర్గం కోరింగ గ్రామంలో ఎల్లుండి బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో బాబు పర్యటనలు ఉండేలా ప్రణాళిక సిద్దం చేసింది టీడీపీ. మహానాడు వరకు జిల్లాల్లోనే పర్యటించనున్నారు చంద్రబాబు. అటు సొంత నియోజకవర్గమైన కుప్పంపైనా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Read Also… Dasari Narayana Rao: దాసరికి దాసరే సరిసాటి! నో వన్ ఈజ్ కంపేరబుల్ టు హిమ్!