MP Sanjeev Kumar: ఎంపీనే బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు .. పాన్ కార్డు అప్డేట్ చేసుకోమని డబ్బులు డ్రా
MP Sanjeev Kumar: కర్నూలు(Kurnool) ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సైబర్ నేరగాళ్ల(Cyber Crime) ఉచ్చులో చిక్కుకున్నారు. ఎంపీ అకౌంట్ నుంచి ఆన్లైన్ లో రెండు సార్లు కలిపి.
MP Sanjeev Kumar: కర్నూలు(Kurnool) ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సైబర్ నేరగాళ్ల(Cyber Crime) ఉచ్చులో చిక్కుకున్నారు. ఎంపీ అకౌంట్ నుంచి ఆన్లైన్ లో రెండు సార్లు కలిపి 97,699 రూపాయలు సైబర్ నేరగాడు డ్రా చేసుకున్నారు. ఇది తెలుసుకున్న ఎంపీ సంజీవ్ కుమార్ అవాక్కయ్యారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈనెల 2వ తేదీ ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీకి ఫోన్ చేశారు. పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఒక లింకు పంపించారు. ఆ లింకును ఎంపీ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఎంపీ సెల్ఫోన్ కు వచ్చిన ఓటిపి నీ సైబర్ నేరగాళ్లు తీసుకుని ఆయన బ్యాంకు ఖాతా నుంచి రెండు విడతలుగా నగదు కాల్ చేశారు.
మొదట48,700 డ్రా చేశారు. రెండవ విడతగా 48,999 డ్రా చేశారు. అదే రోజు మధ్యాహ్నం తన అకౌంట్ నుంచి నగదు డ్రా అయినట్లు అనుమానం వచ్చిన ఎంపీ అకౌంట్లో చెక్ చేసుకున్నారు. నగదు కాచేసినట్లు గుర్తించి ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పంపిన లింకులు సైబర్ ల్యాబ్ కు పంపి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు పాన్ కార్డు అకౌంట్ డీటెయిల్స్ అడిగితే ఇవ్వవద్దని, ఏమైనా లింకులు యాప్లు పంపితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్ పి సుధీర్ సూచిస్తున్నారు.
Reporter: Naga Reddy Kurnool, TV9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Chanakya Niti: ఈ మూడు పనులు చేసిన వెంటనే స్నానం చేయాల్సిందే అంటున్న చాణక్య
Yellow Watermelon: కోనసీమలో అడుగు పెట్టిన పసుపు పుచ్చకాయ.. ఈ పంటతో లాభాలను ఆర్జిస్తున్న రైతు..