Yellow Watermelon: కోనసీమలో అడుగు పెట్టిన పసుపు పుచ్చకాయ.. ఈ పంటతో లాభాలను ఆర్జిస్తున్న రైతు..

Yellow Watermelon Farming: చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే.. కృషి పట్టుదల ఎంత అవసరమో.. అన్నదాత ఆర్ధికంగా నష్టపోకుండా ఉండాలంటే.. కాలానుగుణంగా ఆధునిక పద్దతుల్లో పంటలు..

Yellow Watermelon: కోనసీమలో అడుగు పెట్టిన పసుపు పుచ్చకాయ.. ఈ పంటతో లాభాలను ఆర్జిస్తున్న రైతు..
Yellow Watermelons
Follow us
Surya Kala

|

Updated on: May 04, 2022 | 11:17 AM

Yellow Watermelon Farming: చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే.. కృషి పట్టుదల ఎంత అవసరమో.. అన్నదాత ఆర్ధికంగా నష్టపోకుండా ఉండాలంటే.. కాలానుగుణంగా ఆధునిక పద్దతుల్లో పంటలు పండించాల్సి ఉంటుంది. దీంతో అనేక మంది రైతులు సరికొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ.. సాగులో విజయాన్ని అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ కోనసీమ రైతు.. పసుపు రంగు పుచ్చకాయలు పండిస్తూ.. లాభాలను ఆర్జిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీనివాస్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే ఈ సారి సొంత ఊళ్ళోనే ఉపాధిని కల్పించుకోవాలనుకున్నాడు. అప్పుడు అతని దృష్టి వ్యవసాయంమీద పడింది. ముఖ్యంగా డిఫరెంట్ పద్దతిలో సాగు చేయాలనీ భావించాడు. దీంతో పసుపు పుచ్చకాయ పంటను పండించాలని భావించాడు. దీంతో కేశనపల్లి గ్రామంలో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని ప్రయోగాత్మకంగా పసుపు రంగు పుచ్చకాయలు పంట వేసాడు. అయితే కేశనపల్లి పరిశర ప్రాంతాల్లోని భూమి ఇసుకతో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సరుగుడుని వేస్తారు. కానీ శ్రీనివాస్ ఈ నెలలో పసుపు రంగు పుచ్చకాయలు సాగును ప్రయోగాత్మకంగా చేపట్టాడు. అనేకాదు కర్బూజ పండ్ల సాగు కూడా చేపట్టాడు. మొదట్లో నష్టం వచ్చింది. అయినప్పటికీ వ్యవసాయం దండగ అనుకోలేదు.. మళ్లీ ఈ ఏడాది కూడా పంట వేశాడు. అయితే ఈ ఏడాది పంట పెట్టుబడి పోగా లాభాలను సొంతం చేసుకున్నాడు.

ఎకరం భూమిలో ఎరుపు రంగు పుచ్ఛతో పాటు పసుపు రంగు పుచ్చకాయలు, కర్బూజాలను ఏకకాలంలో పండించాడు.   ఎకరానికి రూ. ఒక లక్షా అరవై వేల ఆదాయాన్ని ఆర్జించాడు. పెట్టుబడి  పెట్టిన రూ 60 వేలు పోగా తనకు లక్ష వరకు లాభం వచ్చిందని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ను ఇటువంటి రకాల పుచ్చుకాయలు మొదటి సారని శ్రీనివాస్ అంటున్నాడు. అంతేకాదు ఒక్కో పుచ్చకాయ బరువు 8 కిలోలు, కర్బూజా బరువు 4కిలోల వరకు ఉన్నయని తెలిపాడు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ఉత్సాహంగా సాగు చేసి మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తానని ధీమా  వ్యక్తం చేస్తున్నాడు శ్రీనివాస్.

Also Read: Video Viral: పెళ్లిలో నోరు తుడుచుకోవడానికి సరికొత్త టిష్యు కనిపెట్టిన అతిథి.. చూస్తే పడిపడి నవ్వుతారంతే