AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రిళ్లు గొంతు ఎండిపోయి దాహం వేస్తుందా ?.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే.. ఎలా తగ్గించాలంటే..

అర్ధరాత్రిళ్లు గొంతు ఎండిపోవడం.. విపరీతంగా దాహం వేయడం వలన చాలా మందికి నిద్రభంగం వాటిల్లుతుంది. ఈ సమస్య కొందరికి వేసవిలో ఎక్కువగా జరుగుతుంటుంది

అర్ధరాత్రిళ్లు గొంతు ఎండిపోయి దాహం వేస్తుందా ?.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే.. ఎలా తగ్గించాలంటే..
Water
Rajitha Chanti
|

Updated on: May 04, 2022 | 11:11 AM

Share

అర్ధరాత్రిళ్లు గొంతు ఎండిపోవడం.. విపరీతంగా దాహం వేయడం వలన చాలా మందికి నిద్రభంగం వాటిల్లుతుంది. ఈ సమస్య కొందరికి వేసవిలో ఎక్కువగా జరుగుతుంటుంది.. అలాగే మరికొందరికి ప్రతి సీజన్లో జరుగుతుంది. వేసవిలో శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయి.. గొంతు ఎండిపోయి తీవ్రంగా దాహం వేస్తుంటుంది. అయితే ఇది కేవలం పెరిగిన ఉష్ణోగ్రతల వలన మాత్రమే కాదు.. మరిన్ని ఇతర అనారోగ్య సమస్యల కారణంగానూ ఇలా అర్ధరాత్రిళ్లు దాహం వేస్తుంటుంది. ఇలా రాత్రిళ్లు నిద్రలో దాహం వేయడానికి గల కారణాలు.. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా.

రాత్రిళ్లు దాహం వేయడం.. నిద్రలో నుంచి మేల్కోవడం.. నీళ్లు తాగిన తర్వాత ఇక నిద్రపట్టదు.. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే.. మీరు రోజులో శరీరానికి సరిపడేంత నీరు తాగలేదని అర్థం. దీంతో రాత్రిళ్లు పలుమార్లు దాహం వేసి నిద్రకు ఆటంకం కలుగుతుంది. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం చాలా మంచిది.

పగలు కాఫీ, టీ, సోడా, చక్కెరతో చేసిన సీరప్ తీసుకోవడం వలన శరీరానికి తగినంత నీరు తాగకపోవడం వలన అంతగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే చక్కెర, సోడా మరియు కెఫిన్ మీ శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గించడానికి పని చేస్తాయి. వీటి వలన శరీరం తేమను కోల్పోతుంది.

ఉప్పు, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన రాత్రిళ్లు గొంతు ఎండిపోయి దాహం వేస్తుంది. ఉప్పు, మసాలాలు రెండూ శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీంతో శరీరంలో హైడ్రేషన్ లోపించి గాఢనిద్రలో దాహం వేస్తుంది.

పరిష్కారాలు.. * రోజులో ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ, టీ తాగవద్దు. * సోడా, శీతల పానీయాలు, షర్బత్ మితంగా తీసుకోవాలి. లస్సీ, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు తీసుకోవడం మంచిది. * వేసవిలో మసాలాలు, నూనెలో వేయించిన ఆహారాన్ని తీసుకోవద్దు. * ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవడం మానేయాలి. ఇవి శరీరంలో నీటి కొరతను కలిగించడమే కాకుండా అధిక రక్తపోటు వ్యాధిని కలిగిస్తాయి.

గమనిక :- ఈ కథనం కేవలం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలు.. సూచనల.. ఇతర నివేధికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.. సందేహాలకు ముందుగా వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Liger: అప్పుడే మొదలైన రౌడీ దండయాత్ర.. భారీ ధరకు లైగర్ డిజిటల్ ఆడియో రైట్స్..

Suhasini: భాష వివాదంపై స్పందించిన నటి సుహాసిని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

Prabhas-Anushka: మరోసారి హిట్ పెయిర్ రిపీట్.. ప్రభాస్ సరసన అనుష్క ?.. ఏ సినిమాలో అంటే..

Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
ఇక ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు కుదరదు.. పిజ్జా, బర్గర్ లవర్స్‌కు
ఇక ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు కుదరదు.. పిజ్జా, బర్గర్ లవర్స్‌కు
Virat Kohli: ఛేజింగ్‌లో మాస్టర్.. మరి ఆ సబ్జెక్ట్‌లో..?
Virat Kohli: ఛేజింగ్‌లో మాస్టర్.. మరి ఆ సబ్జెక్ట్‌లో..?
రైల్వే టికెట్లపై 50 శాతం రాయితీ! బడ్జెట్‌లో కేంద్రం బిగ్ డెసిషన్
రైల్వే టికెట్లపై 50 శాతం రాయితీ! బడ్జెట్‌లో కేంద్రం బిగ్ డెసిషన్
ఈ సింపుల్ ట్రిక్‌తో తెలిస్తే.. నల్లగా మారిన టీ జల్లెడ క్షణాల్లో
ఈ సింపుల్ ట్రిక్‌తో తెలిస్తే.. నల్లగా మారిన టీ జల్లెడ క్షణాల్లో
పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే.. నిజంగా ఆ సమస్యలు వస్తాయా?
పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే.. నిజంగా ఆ సమస్యలు వస్తాయా?
భయాల్నిదూరం చేసే కాళీ ముద్ర.. రోజూ ప్రాక్టీస్‌ చేశారంటే
భయాల్నిదూరం చేసే కాళీ ముద్ర.. రోజూ ప్రాక్టీస్‌ చేశారంటే
హైదరాబాద్‌లోని ఆ ప్రాంత వాసులకు గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్‌లోని ఆ ప్రాంత వాసులకు గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్ కష్టాలు
నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం..
నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం..
ఈ పండ్లు తింటే మీ సంతాన సామర్థ్యానికి ఢోకా ఉండదు..
ఈ పండ్లు తింటే మీ సంతాన సామర్థ్యానికి ఢోకా ఉండదు..