World Asthma Day 2022: ఆస్తమా రోగులు పొరపాటున కూడా వీటిని తినకూడదు.. మర్చిపోతే ఇక అంతే సంగతులు..

ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. శ్వాసనాళాలు పనిచేయకపోవడం.. ఉబ్బిపోవడం.. 

World Asthma Day 2022: ఆస్తమా రోగులు పొరపాటున కూడా వీటిని తినకూడదు.. మర్చిపోతే ఇక అంతే సంగతులు..
Astma
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2022 | 8:38 AM

ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. శ్వాసనాళాలు పనిచేయకపోవడం.. ఉబ్బిపోవడం..  (Astma)అందులో అధిక శ్లేష్మం ఉత్పత్తి కావడమే ఆస్తమా సమస్య. దీంతో శ్వాస తీసుకోవడం మరింత కష్టతరమవుతుంది. ఊపిరి తీసుకుంటున్న సమయంలో దగ్గు, విజింగ్, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఆస్తమా వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను వదిలించుకోవడం చాలా కష్టం.. కానీ ఎల్లప్పుడు అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవడం వలన ఆస్తమాను నియంత్రించవచ్చు. ఈ ఆస్తమా రోగులు తీసుకునే పదార్థాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి..వీరు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని పరిశోధనల ప్రకారం పండ్లు, కూరగాయలు వంటి తాజా ఆహారాలను తినడం ద్వారా ఆస్తమా లక్షణాలను నియంత్రించవచ్చు. ఆస్తమా రోగులు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి.. ఏం తినకూడదో తెలుసుకుందామా.

ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి.. విటమిన్ డి.. తగినంత విటమిన్ డి తీసుకోవడం వలన 6 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో ఆస్తమా సమస్య తగ్గుతుంది. వీరు.. సాల్మన్ చేప, పాలు, నారింజ రసం, గుడ్లు తీసుకోవాలి. విటమిన్ ఎ.. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యాయనం ప్రకారం.. ఆస్తమా ఉన్నవారి శరీరంలో విటమిన్ ఏ లోపం ఉన్నట్లు తెలీంది. శరీరంలో విటమిన్ ఎ లోపాన్ని తగ్గిస్తుంది. ఉపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయ. వీరు క్యారెట్, చిలగడదుంప, ఆకు కూరలు, బ్రోకలీ తీసుకోవాలి. యాపిల్.. ఆస్తమా రోగులకు యాపిల్ మంచిది. ఇది ఊపిరితిత్తుల పని సామార్థ్యాన్ని పెంచుతుంది. ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెగ్నీషియం.. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ఆస్తమా సమస్య అదుపులో ఉంచుకోవచ్చు. పాలకూర, గుమ్మడికాయ గింజలు, డార్క్ చాక్లెట్, సాల్మన్ చేపలు తీసుకోవాలి.

ఎలాంటి పదార్థాలు తినకూడదు.. సల్ఫైట్స్.. అస్తమా సమస్యను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలలో అధిక మొత్తంలో సల్పైట్స్ ఉంటాయి. వీరు వైన్, ఎండిన ఆహారాలు, పుల్లని పదార్థాలు, కీర దోసకాయ, నిమ్మరసం, నిమ్మ పానీయాలు తీసుకోవద్దు. కడుపులో గ్యాస్ తయారు చేసే ఆహారాలు.. కడుపులో గ్యాస్‌ను తయారు చేసే పదార్థాలను తీసుకోవడం వల్ల డయాఫ్రాగమ్‌పై చాలా ఒత్తిడి పడుతుంది. దీంతో ఛాతీలో బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఇది ఆస్తమా సమస్యను పెంచుతుంది. బీన్స్, క్యాబేజీ, కార్బోనేట్ పానీయాలు, ఉల్లిపాయాలు, వెల్లుల్లి, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సాలిసిలేట్స్.. కాఫీ, టీ..కొన్ని మూలికలు.. సుగంధద్రవ్యాలలో కనిపించే సాలిసిలేట్స్ సున్నితంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఫుడ్స్.. ఆస్తమా రోగులు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..

Degala Babji Movie: డేగల బాబ్జీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బండ్ల గణేష్ విడుదలయ్యేది అప్పుడే..

F3 Movie: ఈసారి సూపర్ హిట్ పక్కా.. ఎఫ్ 2 కి మించి ఉంటుంది.. ఎడిటర్ తమ్మిరాజు కామెంట్స్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!