AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Side Effects: నిమ్మరసం మంచిదని అతిగా తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

ఎండకాలం(Summer) నిమ్మరసం(lemon) తాగితే మంచిది. ఎందుకంటే నిమ్మరసంలో యాసిడ్(Acide) ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కడుపులో ఉండే హానిచేసే క్రిములను చంపేస్తాయి...

Lemon Side Effects: నిమ్మరసం మంచిదని అతిగా తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
Lemon
Srinivas Chekkilla
| Edited By: Anil kumar poka|

Updated on: May 04, 2022 | 9:48 AM

Share

ఎండకాలం(Summer) నిమ్మరసం(lemon) తాగితే మంచిది. ఎందుకంటే నిమ్మరసంలో యాసిడ్(Acide) ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కడుపులో ఉండే హానిచేసే క్రిములను చంపేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నిమ్మకాయ కూడా మనకు హానీ చేస్తుందని మీకు తెలుసా… మోతాదుకు మించి తీసుకున్నప్పుడు నిమ్మ రసం శరీరానికి హాని చేస్తుంది. నిమ్మలో అసిడిక్ స్థాయిలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల గొంతు నొప్పి, హార్ట్ బర్న్, ఛాతి నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిమ్మలేదా సిట్రిస్ పండ్లను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మన శరీరంలో అవసరమైన దానికంటే ఐరన్ నిల్వ ఎక్కువగా ఉంటుంది.

దీంతో ఐరన్ ఓవర్ లోడ్ లేదా Hemo chromatosis వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. నిమ్మరసాన్ని మోతాదుకు మించి తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. నిమ్మరసంలో టైరామిన్ అనే అమినో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుకు ఒక్కసారిగా Blood flow పెంచడంతో తలనొప్పి , క్రోనిక్ టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది. నిమ్మరసం దంతసమస్యలకు కారణమవుతుంది. నిమ్మలో సిట్రిక్ యాసిడి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పళ్ల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. దీంతో పళ్ల రంగు మారడం, దంతక్షయం, క్యావిటీ వంటి సమస్యలు వస్తాయి. చాలా మంది నిమ్మను జుట్టుకు కూడా ఉపయోగిస్తుంటారు. నిజానికి జుట్టుకు నిమ్మను ఉపయోగించడం వల్ల జుట్టు వీక్‌గా మారడంతో పాటుగా పొడిబారుతుందట.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also.. Health Tips: రోజుకు మీరు ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నారు ?.. ఇంతకీ నీరు ఎంత శాతం తాగితే అద్భుత ప్రయోజనాలో తెలుసా..