Jayamma Panchayathi: మహేష్ బాబు చేతుల మీదుగా జయమ్మ పంచాయతీ ట్రైలర్.. ఈసారి మరింత ఆసక్తికరంగా..
బుల్లితెర యాంకరమ్మ సుమ కనకాల (suma Kanakala) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయతీ.. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో థియేటర్లలో
బుల్లితెర యాంకరమ్మ సుమ కనకాల (suma Kanakala) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయతీ.. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతుంది సుమ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే… ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని కలిగించింది. అనారోగ్యంగా ఉన్న భర్త.. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునేందుకు తనకు తాన బలమైన నిర్ణయం తీసుకోవడం.. ఈ క్రమంలోనే గ్రామంపై కూడా పోరాటానికి సిద్ధమవుతుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లుగా ట్రైలర్లోనే చూపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్.. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా మే 4న మరో ట్రైలర్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తిగా ఉందని చెప్పాలి. ఇందులో బలమైన ఎమోషన్స్.. డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో సుమ తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరకానున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేయనున్నట్లుగా ప్రమోషన్స్ షూరు చేశారు మేకర్స్. ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా ధను అంధ్లూరి, ఎడిటర్‌గా రవితేజ గిరిజాల ఈ సినిమా కోసం పనిచేశారు.
ట్వీట్..
Here’s the trailer of #JayammaPanchayathi
Best wishes to @ItsSumaKanakala garu for her big screen journey! Looking forward to May 6th! https://t.co/Jo4mgvjAbh@mmkeeravaani @vijaykalivarapu @PrakashBalaga @vennelacreation @adityamusic
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Liger: అప్పుడే మొదలైన రౌడీ దండయాత్ర.. భారీ ధరకు లైగర్ డిజిటల్ ఆడియో రైట్స్..
Suhasini: భాష వివాదంపై స్పందించిన నటి సుహాసిని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
Prabhas-Anushka: మరోసారి హిట్ పెయిర్ రిపీట్.. ప్రభాస్ సరసన అనుష్క ?.. ఏ సినిమాలో అంటే..