AP: ఏపీకి విపత్తుల నిర్వహణ శాఖ పిడుగుల హెచ్చరిక.. ముఖ్యంగా ఆ జిల్లా ప్రజలకు అలెర్ట్

ఏపీలోని నాలుగు జిల్లాలను విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. అలెర్ట్‌గా ఉండాలని సూచించింది.

AP: ఏపీకి విపత్తుల నిర్వహణ శాఖ పిడుగుల హెచ్చరిక.. ముఖ్యంగా ఆ జిల్లా ప్రజలకు అలెర్ట్
Thunderbolt In Ap
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 5:07 PM

AP Weather: ఏపీలోని ప్రజలకు అలెర్ట్. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కాగా నాలుగు జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పల్నాడు(Palnadu) జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జిల్లాలోని మాచర్ల(Macherla), రెంటచింతల(Rentachintala), గురజాల, దాచేపల్లి, వెల్దుర్తి, దుర్గి, కారెంపూడి, పిడుగురాళ్ల, బొల్లపల్లి మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉన్నట్లు తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పిడుగులు పడవచ్చని అలెర్ట్ చేసింది. ఈ జిల్లాల్లోని వై.రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, దేవీపట్నం ప్రాంతాలతో పాటు.. గోకవరం, కోరుకొండ, జగ్గంపేట, ఏలేశ్వరం , వీరబల్లి, రామాపురం, రాయచోటి చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు, గొర్ల కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.

మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం దంచి కొడుతోంది. రాయలసీమతో పాటూ కొస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. చిత్తూరులోని కుప్పంలో వర్షం కురుస్తోంది.. గాలివానతో దుమారం రేగింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Also Read: భర్త ఏమో సంసారానికి పనికిరాడు.. బావ ఏమో వేధిస్తున్నాడు.. ఆమె ఏం చేసిందంటే..?