AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: సింగిల్ డోస్ అని ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. రక్తం గడ్డ కడుతుందని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరిక

America: కరోనా వైరస్ నియంత్రణ కోసం అమెరికాలో ఇస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పై (Johnson and Johnson COVID-19 vaccine) అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)..

America: సింగిల్ డోస్ అని ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. రక్తం గడ్డ కడుతుందని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరిక
Johnson And Johnson Covid
Surya Kala
|

Updated on: May 06, 2022 | 9:19 AM

Share

America: కరోనా వైరస్ నియంత్రణ కోసం అమెరికాలో ఇస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పై (Johnson and Johnson COVID-19 vaccine) అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సంచలన ప్రకటన చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికి దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయంటూ యూఎస్ ఎఫ్‌డీఏ  స్పష్టం చేసింది. FDA గత ఏడాది ఫిబ్రవరిలో 18 ఏళ్లు  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఇవ్వదానికి అనుమతినిచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను మొదట్లో మహమ్మారితో పోరాడడంలో ముఖ్యమైన సాధనంగా పరిగణించారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ డోసు ఒక్కటి మాత్రమే అవసరం.. అదే ఫైజర్మో, డర్నా టీకాలు రెండు డోస్‌లు వేసుకోవాల్సి ఉంది. దీనికంటే సింగిల్-డోస్ బెస్ట్ అంటూ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ను ఎంపిక చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఇప్పటి వరకూ 18 మిలియన్ల అమెరికన్లకు జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని.. ఈ వ్యాక్సిన్  పొందేవారు వారి సంఖ్య  పరిమితం చేయాలని సూచించింది. తక్కువ స్థాయి రక్త ప్లేట్‌లెట్లతో కలిపి అరుదైన, ప్రాణాంతక రక్తం గడ్డకట్టే సిండ్రోమ్ అయిన థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్)తో థ్రాంబోసిస్ ప్రమాదం ఉందని ఎఫ్‌డీఏ నిర్ధారించింది.

“COVID-19 నుండి తీవ్రమైన ఫలితాలను నిరోధించడంలో సమానంగా ప్రభావవంతంగా కనిపించే ప్రత్యామ్నాయం ఉంటే, ప్రజలు దానిని ఎంచుకోవడాన్ని మేము చూస్తాము” అని మార్క్స్ చెప్పారు.  ఈ వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం  మొదటి రెండు వారాల్లో ఈ సమస్య ఏర్పడుతుందని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, కాలు వాపు, నిరంతర పొత్తికడుపు నొప్పి, తలనొప్పి లేదా అస్పష్టమైన దృష్టి వంటి నాడీ, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. కొంతమందిలో వ్యాక్సిన్ తీసుకున్న చోట చర్మం కింద పెటెచియా అని పిలిచే ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయని యూఎస్ శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇప్పటి వరకూ అమెరికాలో Pfizer , Moderna వ్యాక్సిన్ లను అత్యధికంగా అందించారు. 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది అమెరికన్లు ఈ కంపెనీల రెండు-డోసులను తీసుకున్నారు. 18 మిలియన్ల కంటే తక్కువ మంది అమెరికన్లు J&J వ్యాక్సిన్ తీసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Weather Updates: తెలుగురాష్ట్రాల్లో భిన్నవాతావరణం.. ఓవైపు వర్షాలు, మరోవైపు భానుడు భగభగలు..

Afghan Crisis: మహిళలపై మరోసారి కఠిన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..