Afghan Crisis: మహిళలపై మరోసారి కఠిన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..

Afghan Women:ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు(Talibans) పరిపాలన చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే తమ దేశంలోని మహిళలకు చదువు, దుస్తులు వంటి..

Afghan Crisis: మహిళలపై మరోసారి కఠిన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..
Afghan Women
Follow us
Surya Kala

|

Updated on: May 06, 2022 | 8:06 AM

Afghan Women:ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు(Talibans) పరిపాలన చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే తమ దేశంలోని మహిళలకు చదువు, దుస్తులు వంటి అనేక విషయాలపై రకరకాల ఆంక్షలను విధించారు. అయితే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాదు డ్రైవింగ్ టీచర్లకు కూడా ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలను జారీ చేసినట్లు ప్రకటించింది. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకోవడానికి ముందు.. కాబూల్‌తో సహా దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మహిళలు  డ్రైవింగ్ చేసేవారు. అయితే.. ఇప్పుడు తాలిబన్లు ఇప్పుడు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌లను నిలిపివేసింది.

గత ఏడాది ఆగస్టులో ఆఫ్ఘన్ ప్రభుత్వం పతనమై..  తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పోరాటాలు ముగిసినప్పటికీ, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తాలిబన్లు.. మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు

ఇటీవలి డిక్రీలో బాలికలను ఆరవ తరగతి కంటే చదవకూడదని.. పాఠశాలకు బాలికలు హాజరుకాకుండా నిషేధించింది. ఈ నిషేధాన్ని ప్రపంచదేశాలు ఖండించాయి. అయితే తాము “ఉపాధ్యాయుల కొరత” కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు అక్కడ ప్రభుత్వం తెలిపింది. ఆరవ తరగతి దాటి చదువుకునే బాలికల హక్కు “త్వరలో” పునరుద్ధరించబడుతుందని  చెప్పారు. అంతర్జాతీయ అంచనాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన మానవ సంక్షోభంతో పోరాడుతోంది, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

భారత్‌లో రెండేళ్లలో 47లక్షల మరణాలు.. WHO ప్రకటన.. గణాంకాల శాస్త్రీయతపై కేంద్రం అభ్యంతరం

Lady Singham: మోసగాడని తెలియడంతో.. కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన మహిళా పోలీస్.. లేడీ సింగమలై అంటూ ప్రశంసలు..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!