Corona Virus: భారత్‌లో రెండేళ్లలో 47లక్షల మరణాలు.. WHO ప్రకటన.. గణాంకాల శాస్త్రీయతపై కేంద్రం అభ్యంతరం

Corona Virus: కరోనా వైరస్ భారత దేశంలో(Bharath) రెండేళ్లలో విధ్వసం సృష్టించిందని.. జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో దాదాపు 47 లక్షల మరణాలు నమోదయ్యాయని..

Corona Virus: భారత్‌లో రెండేళ్లలో 47లక్షల మరణాలు.. WHO ప్రకటన.. గణాంకాల శాస్త్రీయతపై కేంద్రం అభ్యంతరం
India Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: May 06, 2022 | 6:57 AM

Corona Virus: కరోనా వైరస్ భారత దేశంలో(Bharath) రెండేళ్లలో విధ్వసం సృష్టించిందని.. జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో దాదాపు 47 లక్షల మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై భారతదేశం గురువారం అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఈ రెండేళ్ల కాలంలో దేశంలో సుమారు 5,20,000 మరణాలు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన కరోనా మరణాలపై లెక్కలు.. అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు..  ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడవ వంతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నివేదిక కోసం ఉపయోగించిన నమూనాల చెల్లుబాటు, పటిష్టత , డేటా సేకరణ, పద్దతి సందేహాస్పదంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

భారతదేశ ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండా..  పరిష్కరించకుండా WHO అదనపు మరణాల అంచనాలను విడుదల చేసింది” అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. “గణాంకంగా అసంబద్ధమైనదని, శాస్త్రీయంగా సందేహాస్పదమైనది” అని తెలిపింది. దేశంలో జనన, మరణాల నమోదుకు అత్యంత బలమైన వ్యవస్థ ఉందని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో డేటా సేకరణ వ్యవస్థను ప్రశ్నించింది. అసంబద్ధంగా ఉన్న ఈ గణాంకాల శాస్త్రీయతపై అనుమానాలు వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:Bad Habits: ఆహారం తిన్న వెంటనే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పెట్టుబడులకు అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..