Bad Habits: ఆహారం తిన్న వెంటనే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!

Bad Habits: దైనందిన జీవితంలో ఆహారం తిన్న తర్వాత తెలిసో, తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే, తెలిసి చేసినా, తెలియక చేసినా..

Bad Habits: ఆహారం తిన్న వెంటనే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!
Eating
Follow us
Shiva Prajapati

|

Updated on: May 06, 2022 | 6:45 AM

Bad Habits: దైనందిన జీవితంలో ఆహారం తిన్న తర్వాత తెలిసో, తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే, తెలిసి చేసినా, తెలియక చేసినా అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా ఆహారం తిన్న వెంటనే స్నానం చేయడం ఇందులో మొదటి అంశంగా పేర్కొంటున్నారు నిపుణులు. అవును, ఆహారం తిన్న వెంటనే స్నానం చేస్తే దాని ప్రభావాన్ని ఫేస్ చేయాల్సిందేనని చెబుతున్నారు. ఊబకాయం, అసిడిటీ, మలబద్ధకం వంటి వ్యాధులకు ఈ చర్య కారణమవుతుందంటున్నారు. అందుకని.. అన్నం తిన్న వెంటనే స్నానం అస్సలు చేయొద్దు. ఇదొక్కటే కాదు.. అన్నం తిన్న వెంటనే ఏమేం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

తిన్న వెంటనే స్నానం చేయొద్దు.. ఉదయం అల్పాహారం చేసిన తరువాత గానీ, రాత్రి భోజనం చేసిన తరువాత గానీ అస్సలు స్నానం చేయొద్దు. అలా చేస్తే.. మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. స్నానం చేసిన తరువాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దానివల్ల ఆహారం సరిగా జీర్ణం అవదు. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

భోజనం తరువాత పండ్లు తినొద్దు.. చాలా మంది భోజనం చేసిన తరువాత గానీ, అల్పాహారం చేసిన తరువాత గానీ వెంటనే పండ్లు తింటారు. కానీ, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్న వెంటనే పండ్లు తినడం వల్ల శరీరంలో ఎసిడిటీ పెరుగుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

భోజనం తరువాత ధూమపానం చేయొద్దు.. కొందరికి ఆహారం తిన్న తరువాత పొగతాగే అలవాటు ఉంటుంది. కానీ, ఆ అలవాటు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ దురలవాటు స్థూలకాయానికి దారి తీస్తుందట. కావున.. ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది.

తిన్న వెంటనే పడుకోకూడదు.. కొంతమంది తిన్నవెంటనే పడుకుంటారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే పడుకోవడం వలన ఆహారం జీర్ణం అవదు. పైగా జీర్ణ వ్యవస్థ పనితీరుపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే తిన్న తరువాత కాసేపునడవాలి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, నిపుణుల సలహాల మేరకు అందించడం జరిగింది. ఏవైనా ఆరోగ్య సమస్యలున్నా, సందేహాలున్నా నిపుణులను సంప్రదించడం ముఖ్యం. వీటిని టీవీ9 తెలుగు దృవీకరించడం లేదు.