AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మగాళ్లూ ఇది మీకోసమే.. ఈ గింజలు తింటే ఆ ట్యాబ్లెట్‌‌తో పనిలేదు.. డబుల్ బెనిఫిట్స్ కూడా.!

గుమ్మడి కాయలు.. ప్రతీ వంటింట్లో ఉండే ఈ కూరగాయతో కూరగానీ, స్వీట్‌ను గానీ చేసుకుంటుంటారు. అయితే వీటి గింజలను మాత్రం పక్కన పారేస్తారు..

Health Tips: మగాళ్లూ ఇది మీకోసమే.. ఈ గింజలు తింటే ఆ ట్యాబ్లెట్‌‌తో పనిలేదు.. డబుల్ బెనిఫిట్స్ కూడా.!
Pumpkin Seeds
Ravi Kiran
|

Updated on: May 05, 2022 | 9:02 PM

Share

గుమ్మడి కాయలు.. ప్రతీ వంటింట్లో ఉండే ఈ కూరగాయతో కూరగానీ, స్వీట్‌ను గానీ చేసుకుంటుంటారు. అయితే వీటి గింజలను మాత్రం పక్కన పారేస్తారు. ఒకవేళ మీరూ అలా చేస్తుంటే.. ఇకపై పద్దతి మార్చుకోండి. గుమ్మడి గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఈ సీడ్స్‌లో ఉండే పోషకాలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే మగాళ్లూ ఈ గింజలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అదెందుకో.? వాచ్ ది స్టోరీ..

వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటం ఈ మధ్య కొంతమంది పురుషులను వేధిస్తున్న సమస్య. అలాగే మరికొంతమందిని లైంగిక సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో ఈ సమస్యలను పరిష్కరించేందుకు చాలామంది వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అయితే వీటివల్ల ప్రయోజనాల కంటే సైడ్‌ఎఫెక్ట్సే ఎక్కువ ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ట్యాబ్లెట్స్‌తో కాకుండా పోషకాహారంతోనే లైంగిక సమస్యలు దూరం చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే వీర్యకణాలు తక్కువగా ఉన్నట్లయితే .. సంతానోత్పత్తి సామర్ధ్యం కూడా తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే.. రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తినాలని పురుషులకు సూచిస్తున్నారు వైద్యులు. ఇలా తినడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు.

గుమ్మడి గింజలు తింటే సంతానోత్పత్తి సామర్ధ్యం పెరగడమే కాదు.. ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు వల్ల ఇమ్యూనిటీ పవర్‌, కంటిచూపు పెరుగుతుంది. అలాగే వీటిల్లో ఉండే పొటాషియం హైబీపీని కంట్రోల్‌లో పెడుతుంది. అలాగే రక్తం సరఫరా మెరుగ్గా సాగేలా చేస్తుంది. దీని వల్ల గుండె జబ్బులను రాకుండా నివారిస్తుంది. అటు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ గింజలు తప్పక తినాలి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడమే కాదు.. కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకుంటాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు గుమ్మడి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు క్యాన్సర్ వంటి రోగాలు దరికి చేరకుండా అడ్డుకుంటాయి. కాగా, గుమ్మడి గింజలు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతాయి. వీటిని ఎవ్వరైనా కూడా తినొచ్చునని వైద్యులు అంటున్నారు..

గమనిక: ఈ ఆర్టికల్‌ కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయబడింది. ఏదైనా డైట్‌ను ఫాలో చేసే ముందు కచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోండి.