AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lady Singham: మోసగాడని తెలియడంతో.. కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన మహిళా పోలీస్.. లేడీ సింగమలై అంటూ ప్రశంసలు

Assam’s Lady Singham: చట్టం న్యాయం ముందు అందరూ సమానమే.. తన పర బేధం లేకుండా వృత్తిని దైవంగా భావించే డ్యూటీ మైండెడ్ పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. అలాంటి మహిళా పోలీసు అధికారిణి..

Lady Singham: మోసగాడని తెలియడంతో.. కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన మహిళా పోలీస్.. లేడీ సింగమలై అంటూ ప్రశంసలు
Assams Lady Singham
Surya Kala
|

Updated on: May 06, 2022 | 7:39 AM

Share

Assam’s Lady Singham: చట్టం న్యాయం ముందు అందరూ సమానమే.. తన పర బేధం లేకుండా వృత్తిని దైవంగా భావించే డ్యూటీ మైండెడ్ పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. అలాంటి మహిళా పోలీసు అధికారిణి ఇప్పుడు అందరితోనూ శభాష్ అనిపించుకుంటుంది. నిజాయతీకి నిలువెత్తు రూపం అంటూ లేడీ సింగమలై అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనకు కాబోయే భర్త మోసగాడు అని తెలియడంతో.. ఏమాత్రం ఆలోచన చేయకుండా తనకు కాబోయే భర్తను అరెస్ట్ చేసింది. ఈ అరుదైన ఘటన అసోంలో(Assam) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నాగాన్ జిల్లాలో జున్మోని రభా సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. రభాకు పొగగ్ అనే యువకుడితో గత అక్టోబర్‌లో నిశ్చితార్ధం అయింది. ఈ ఏడాది నవంబర్ లో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కూడా.. రాణా పొగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మహిళా ఎస్ఐకి పరిచయం చేసుకున్నాడు. అయితే, అతడు ఓ ఘరానా మోసగాడని తర్వాత తేలింది. అయితే తనకు కాబోయే భర్త నేర చరిత్రుడని తెలుసుకున్న తర్వాత.. వెంటనే పొగగ్ ని అరెస్ట్ చేసింది. ఈ ఏడాది నవంబర్ లో వారి పెళ్లి జరగాల్సి ఉంది.

ఈ విషయంపై అస్సాం పోలీసు అధికారి మాట్లాడుతూ..  నిందితుడు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కి చెందిన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అని తప్పుడు సమాచారం ఇచ్చారని  తెలిపారు. పీఎస్‌యూ ఉద్యోగి అనే ముసుగులో ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయాలు వసూలు చేసినట్లు చెప్పారు.  చివరకు పొగాగ్ పాపం పండి.. అతడు చెప్పిన అబద్దాలు బయటపడ్డాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ఐ జున్మోని రభా… కాబోయే భర్త రాణా పొగాగ్ ను అరెస్ట్ చేసింది. పోగాగ్ ఇంటి నుంచి ఓఎన్‌జిసికి చెందిన 11 నకిలీ ముద్రలు , నకిలీ గుర్తింపు కార్డులతో సహా అనేక నేరారోపణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదే విషయంపై సబ్-ఇన్‌స్పెక్టర్‌ రభా స్పందిస్తూ.. తాను ఒక మోసగాడిని అరెస్ట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానని అని చెబుతున్నారు. అంతేకాదు తాను ఓ మోసగాడి బారినుంచి తప్పించుకున్నందుకు చాలా సంతోషముగా ఉన్నానని తెలిపారు.  అతడి నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వేనోళ్ల కృతజ్ఞతలు తెలిపారు. వైవాహిక జీవితంలో తాను మోసపోకుండా కాపాడారని కొనియాడారు. రాణా పోగాగ్ ఎంత మోసగాడో అర్థమైందని వెల్లడించారు.

అయితే తనకు కాబోయే భర్త అని కూడా చూడకుండా మోసగాడని తెలిసిన వెంటనే అరెస్ట్ చేసిన లేడీ పోలీస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రభాని లేడీ సింగం, లేడీ దబాంగ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:Bad Habits: ఆహారం తిన్న వెంటనే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పెట్టుబడులకు అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Corona Virus: భారత్‌లో రెండేళ్లలో 47లక్షల మరణాలు.. WHO ప్రకటన.. గణాంకాల శాస్త్రీయతపై కేంద్రం అభ్యంతరం

వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..