Madhya Pradesh: ఓ కొడుకు.. ఇద్దరు తండ్రులు.. తల పట్టుకుంటున్న పోలీసులు.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..!

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఒక కొడుకు, ఇద్దరు తండ్రుల వివాదానికి సంబంధించి విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.

Madhya Pradesh: ఓ కొడుకు.. ఇద్దరు తండ్రులు.. తల పట్టుకుంటున్న పోలీసులు.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..!
Son
Follow us
Shiva Prajapati

|

Updated on: May 06, 2022 | 6:00 AM

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఒక కొడుకు, ఇద్దరు తండ్రుల వివాదానికి సంబంధించి విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కథ వినడానికి కాస్త సినిమాలా అనిపించినా ఇది వాస్తవం. చిన్ననాటి నుంచి మారుతండ్రి వద్ద పెరిగిన ఆ కొడుక్కి.. 24 ఏళ్ల తరువాత విషయం తెలియడంతో అతని భవిష్యత్ అంధకారంగా మారింది. దాంతో అతనికి ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన ముఖేష్ అహిర్వార్ తాపీ మేస్త్రీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి పెళ్లికూడా అయ్యింది. అయితే, అంతాబాగానే ఉందనుకున్న సమయంలో తన తండ్రి అయిన తులసీదాస్ అహిర్వార్‌తో వివాదం జరిగింది. ఈ వివాదం నేపథ్యంలోనే సంచలన నిజం బయటకొచ్చింది. అది తెలిసి ముఖేష్ షాక్ అయ్యాడు. ‘నేను అసలు నీ తండ్రే కాదు.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపో..’’ అంటూ తులసీదాస్.. ముఖేష్‌ను ఇంటిని నుంచి బయటకు గెంటివేశాడు. నిజంగానే తన తండ్రి తులసీదాస్ కాదని, పహార్‌గావ్‌కు చెందిన గణేష్ అహిర్వార్ అని తెలుసుకున్నాడు ముఖేష్.

24 ఏళ్ల క్రితం తన తల్లి మీరాకు గణేష్‌ అహిర్వార్‌తో వివాహమైంది. ముఖేష్ పుట్టిన మూడు నెలలకే మీరా.. గణేష్‌ను వదిలేసి ఛతర్‌పూర్‌లోని తులసిదాస్ అహిర్వార్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వారి వద్దే పెరిగాడు ముఖేష్. దాంతో తులసిదాస్ అహిర్వారే తన తండ్రి అనుకుంటూ వచ్చాడు. ఇంతలో వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. ఈ విషయం వెలుగు చూసింది. ‘‘నువ్వు నా కొడుకువి కాదు. నీ తండ్రి ఇంటికి నువ్వు వెళ్లిపో..’’ అంటూ ఇటు తలుసీదాస్, అటు కన్న తల్లి ఇద్దరూ కలిసి ముఖేష్‌ను ఇంటి నుంచి గెంటేశారు. మరోవైపు ముఖేష్‌కు మూడేళ్ల క్రితం వివాహం కూడా అయ్యింది. తాజాగా అతని సవతి సోదరుడికి వివాహం నిశ్చయమవడంతో వివాదం రాజుకుంది. అయితే, ఇంటి నుంచి గెంటేసిన తులసీదాస్.. ముఖేష్‌కు కట్నంగా అతని అత్తమామలు ఇచ్చిన సామాగ్రిని ఇచ్చేందుకు నిరాకరించాడు.

ఇవి కూడా చదవండి

ఇక భార్యతో కలిసి ముఖేష్ తన అసలైన తండ్రి వద్దకు వెళ్లగా.. అతను కూడా గెంటివేశాడు. ‘‘24 ఏళ్ల క్రితం మీ తల్లి నిన్ను తీసుకెళ్లింది. ఆమె నా భార్య కానప్పుడు నువ్వు కూడా నా కొడుకువి కాదు.’’ అని స్పష్టం చేశాడు. దాంతో ముఖేష్, అతని భార్య రోడ్డున పడ్డారు. గత మూడు రోజులుగా వీరు ఇంటింటికీ తిరుగుతూ భిక్షమెత్తుకుని ఆకలి తీర్చుకుంటున్నారు. నిలువనీడ లేక, ఇక ఏం చేయాలో తెలియక ముఖేష్ జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నాడు. ముఖేష్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్