Weather Updates: తెలుగురాష్ట్రాల్లో భిన్నవాతావరణం.. ఓవైపు వర్షాలు, మరోవైపు భానుడు భగభగలు..
Weather Updates: ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) విభిన్న వాతావరణం నెలకొంది. ఏపీ (Andhra Pradesh), తెలంగాణల్లో(Telangana) భానుడు భగభగ మండిస్తున్నాడు. మరోవైపు పలు..
Weather Updates: ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) విభిన్న వాతావరణం నెలకొంది. ఏపీ (Andhra Pradesh), తెలంగాణల్లో(Telangana) భానుడు భగభగ మండిస్తున్నాడు. మరోవైపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరిత ఆవర్తనం మద్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నేడు (మే 6న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 లో వాయువ్య దిశగా కదులుతూ.. బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం: రానున్న 3 రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలతో పాటు.. భారీ గాలులు వీచనున్నాయని తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్ర: రానున్న మూడు రోజులపాటు ఇక్కడ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ: ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అధికంగా నమోదకానుంది.
తెలంగాణ: అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల వరకూ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశంఉందని.. ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది.
Also Read: Afghan Crisis: మహిళలపై మరోసారి కఠిన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..