AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్‌ పరీక్షలకు తొలిరోజే 22,210 మంది విద్యార్ధులు గైర్హాజరు.. కారణం ఇదే!

తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్‌ తదితర ద్వితీయ భాషల పరీక్షలకు మొత్తం 4,64,756 మంది హాజరవ్వాల్సి ఉండగా.. ఎన్నడూలేనివిధంగా తొలిరోజు దాదాపు.. 22,210 మంది..

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్‌ పరీక్షలకు తొలిరోజే 22,210 మంది విద్యార్ధులు గైర్హాజరు.. కారణం ఇదే!
Ts Inter Exams 2022
Srilakshmi C
|

Updated on: May 07, 2022 | 4:48 PM

Share

First day of Telangana Intermediate Public Examinations 2022: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు (Inter First Year Exams) శుక్రవారం (మే 6న) నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఎన్నడూలేనివిధంగా తొలిరోజు దాదాపు 22,210 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. ఒక్క నిముషం నిముషం నిబంధన వల్ల, వారిలో పదుల మంది ఉదయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో పరీక్షలు రాయలేకపోయారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్‌ తదితర ద్వితీయ భాషల పరీక్షలకు మొత్తం 4,64,756 మంది హాజరవ్వాల్సి ఉండగా.. 4,42,546 మంది (95.30 శాతం) వచ్చారు. అంటే రాష్ట్రవ్యాష్తంగా సగటున 4.70 శాతం విద్యార్ధులు గైర్హాజరయ్యారు. సిద్దిపేట జిల్లాలో అది 7.50 శాతం ఉండటం గమనార్హం. నిజామాబాద్‌ జిల్లాలో ఒక మాల్‌ప్రాక్టీస్‌ (malpractice) కేసు నమోదైందని ఇంటర్‌బోర్డు తెలిపింది. బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ హైదరాబాద్‌లోని పలు కళాశాలలను సందర్శించారు. నాంపల్లిలోని ఎంఏఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తాగునీటిని అందుబాటులో ఉంచకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించనందుకు అక్కడ చీఫ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న దుర్గను పరీక్షల విధుల నుంచి కలెక్టర్‌ శర్మన్‌ తొలగించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల పరీక్ష కేంద్రాల వద్ద వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Also Read:

TS Police Exam Date 2022: తెలంగాణ పోలీస్‌ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష ఆగస్టులో.. ఈసారి దేహ దారుఢ్య పరీక్షల్లో కీలకమార్పులు..!