TS Police Exam Date 2022: తెలంగాణ పోలీస్‌ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష ఆగస్టులో.. ఈసారి దేహ దారుఢ్య పరీక్షల్లో కీలకమార్పులు..!

తెలంగాణ‌ రాష్ట్రంలో పోలీస్‌ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రిలిమ్స్‌ పరీక్షలను 3 నెలల్లో పూర్తి చేసేందుకు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) సన్నాహాలు చేస్తోంది. కాగా ఇప్పటికే పోలీస్‌ శాఖలో 3 వేరు వేరు నోటిఫికేషన్లు విడుదల..

TS Police Exam Date 2022: తెలంగాణ పోలీస్‌ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష ఆగస్టులో.. ఈసారి దేహ దారుఢ్య పరీక్షల్లో కీలకమార్పులు..!
Tslprb
Follow us

|

Updated on: May 07, 2022 | 3:15 PM

TSLPRB Prelims exam date 2022: తెలంగాణ‌ రాష్ట్రంలో పోలీస్‌ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రిలిమ్స్‌ పరీక్షలను 3 నెలల్లో పూర్తి చేసేందుకు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) సన్నాహాలు చేస్తోంది. కాగా ఇప్పటికే పోలీస్‌ శాఖలో 3 వేరు వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వీటికి సంబంధించిన రాత పరీక్షలు జులై చివరి లేదా ఆగస్టు తొలివారంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోచనలో ఉన్నారు. అభ్యర్థుల వడపోతగా భావించే ప్రిలమ్స్‌ పరీక్ష ఫలితాలను సెప్టెంబరులోగా ప్రకటించాలనే ప్రయత్నాల్లో ఉన్నామని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. అక్టోబరు రెండో వారంలో దేహ దారుఢ్య (PMT, PET) పరీక్షలు నిర్వహిస్తామని, నవంబరులోగా ఫలితాలు ప్రకటిస్తామని.. జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్‌ రాత పరీక్షలుంటాయన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మార్చిలోపు తుది ఫలితాల్ని ప్రకటిస్తామన్నారు. ‘పలువురు అభ్యర్థులు ఎస్సై పోస్టులతో పాటు కానిస్టేబుల్‌ పోస్టులకు కూడా ఎంపికవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కానిస్టేబుల్‌ పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌లు మిగిలిపోతున్నాయి. అందుకే ఎస్సైల ఎంపిక ప్రక్రియ ముందుగానే చేపడుతున్నాం. ఆ తర్వాత రెండు వారాలకు కానిస్టేబుల్‌ పరీక్షలు జరుపుతున్నాం. దీనివల్ల ఎస్సైలుగా ఎంపికైన వారిని కానిస్టేబుల్‌ పోటీ నుంచి తప్పిస్తున్నాం. క్రితంసారి ఇలా చేయడంతో 680 కానిస్టేబుల్‌ పోస్టులను బ్యాక్‌లాగ్‌ కాకుండా నివారించగలిగామని ఛైర్మన్‌ వివరించారు.

దేహ దారుఢ్య పోటీలు ఇలా..

గతంలో 800 మీటర్ల పరుగు పూర్తి చేసిన పురుషుల్లో 99.6 శాతం మంది 100 మీటర్ల పరుగునూ పూర్తి చేశారు. మహిళలు 100 మీటర్ల పరుగుకు 20 సెకన్ల గడువుండటంతో దాదాపు అందరూ పూర్తి చేస్తున్నారు. అందుకే ఈ రెండు ఈవెంట్లను తొలగించాం. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పోటీ పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకూ 1600 మీటర్ల పోటీ ఉండటం గమనించదగ్గ అంశం. క్రితంసారి హైజంప్‌లో 18 మంది పురుషులు గాయాలపాలయ్యారు. అందుకే ఈసారి తొలగించాం. ఛాతీ కొలతలు తీసుకునే సమయాలను బట్టి, అధికారులను బట్టి మారుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈవెంట్ల నుంచి తప్పించాం.

దేహ దారుఢ్య పరీక్షల విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం అభ్యర్థి మైదానంలో అడుగుపెట్టగానే బయోమెట్రిక్‌ తీసుకోవడంతో పాటు చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID) పరిజ్ఞానంతో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ వేయాలనే ఆలోచనతో ఉన్నాం. దీనివల్ల అభ్యర్థి మైదానంలో ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఏ సమయంలో పరుగును ప్రారంభించారు..? పూర్తి చేశారు..? అనేది సెకన్ల తేడా లేని కచ్చితత్వంతో సెంట్రల్‌ సర్వర్‌లో నమోదవుతుంది’ అని వివరించారు. శిక్షణలో కొత్త మాడ్యూళ్లను రూపొందించబోతున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

Also Read: 

Mother’s Day 2022: అమ్మను వేదించే మెనోపాజ్‌ బూచి..  ఆ టైంలో ఆమెను ఒంటరిని చేయొద్దు!