Free Coaching 2022: తెలంగాణ పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు మే 12 వరకు పెంపు

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బ్రాహ్మణ నిరుద్యోగులకు (Telangana brahmin unemployees) ఉచిత శిక్షణ, పుస్తకాల పంపిణీ కోసం దరఖాస్తుల గడువును మే 12 వరకు పొడిగించినట్లు..

Free Coaching 2022: తెలంగాణ పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు మే 12 వరకు పెంపు
Free Coaching
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: May 07, 2022 | 6:24 PM

Free Coaching Classes for Telangana Job Aspirants 2022:తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగావున్న 80,039 కొలువుల భర్తీకి కార్యచరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తొలుతగా పోలీస్‌ శాఖలో 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి కూడా. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇక రాష్ట్రంలో పలు నగరాల్లో ఉద్యోగార్ధులు కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించారు. కొలువుకొట్టాలనే పట్టుదలతో మరి కొందరు స్వయంగా సన్నద్ధతను ప్రారంభించారు. దీంతో పలు లైబ్రరీలు, రీడింగ్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఐతే నిరుపేదల కోసం కూడా పలు సంస్థలు ముందుకొచ్చి ఉచిత కోచింగ్‌లు (Free Coaching for competitive exams) కూడా ఏర్పాటు చేశాయి. వీటిల్లో భాగంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బ్రాహ్మణ నిరుద్యోగులు (Telangana brahmin unemployees) ఉచిత శిక్షణ, పుస్తకాల పంపిణీ కోసం దరఖాస్తుల గడువును మే 12 వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌ ఐఏఎస్‌ అధికారి కేవీ రమణాచారి తెలిపారు. గతంలో ఈ గడువు మే 7వ తేదీ వరకు ఉండగా… వివిధ సంఘాలు, అభ్యర్థుల వినతి మేరకు దానిని మరో అయిదురోజులు పెంచామని తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సహకారంతో బ్రాహ్మణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్‌ను అందజేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ brahminparishad.telangana.gov.in ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రమణాచారి సూచించారు.

Also Read:

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్‌ పరీక్షలకు తొలిరోజే 22,210 మంది విద్యార్ధులు గైర్హాజరు.. కారణం ఇదే!