IAS Pooja Singhal: జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఈడీ దాడులు.. ఐఏఎస్ ఇంట్లో రూ.19 కోట్లు స్వాధీనం

జార్ఖండ్‌లో ఈడీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెంచేశాయి. సీనియర్‌ ఐఏఎస్‌ పూజా సింఘాల్‌పై ఈడీ రెయిడ్స్‌ చేసింది. ఆమె సీఏ ఇంట్లో దాదాపు 19 కోట్ల క్యాష్‌ దొరికింది.

IAS Pooja Singhal: జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఈడీ దాడులు.. ఐఏఎస్ ఇంట్లో రూ.19 కోట్లు స్వాధీనం
Pooja Singhal
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 07, 2022 | 6:26 PM

IAS Pooja Singhal Raid: జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ కేసులో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 18 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో రెండో రోజు కూడా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మ‌న్రేగా (ఉపాధి హామీ) నిధుల‌ను మైనింగ్ పేరుతో దుర్వినియోగం చేసిన‌ట్లు ఐఏఎస్ సహా పలువురు వ్యక్తులపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఐఏఎస్ పూజా సింఘాల్ సీఏ సుమన్ సింగ్ ఇంటి నుంచి 19 కోట్ల న‌గ‌దు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం రూ.25 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు సింఘాల్ భర్త అభిషేక్ ఇంట్లో, ఆయన నిర్వహిస్తున్న ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఇంకా దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, అభిషేక్ కె ఝా, సిఎ సుమన్ సింగ్‌ను ఇడి అదుపులోకి తీసుకొని వాంగ్మూలాన్ని సేకరించారు.

కాగా.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాంచీ, చండీఘ‌డ్‌, ముంబై, కోల్‌క‌తా, ముజాఫ‌ర్‌పుర్‌, ఎన్సీఆర్‌, నోయిడా, ఫ‌రీదాబాద్, గురుగ్రామ్‌లో సోదాలు జ‌రిగాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఆ రాష్ట్ర మైనింగ్ మంత్రిగా కూడా కొన‌సాగుతున్నారు. కాగా.. ఐఏఎస్ పూజా సింఘాల్ మైన్స్ జియాలజీ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. అయితే.. ఆమె గర్వాలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్నారు. అయితే.. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు పూజా సింఘాల్‌ సన్నిహిత అధికారిణిగా పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈడీ దాడులు సంచలనంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Nitin Gadkari: దేశంలో భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. వచ్చే రెండేళ్లలో ఎన్నంటే..?

Death Penalty: పోలీసులకు సమాచారం ఇస్తున్నారని.. ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష విధించిన నిషేధిత సంస్థ ఉల్ఫా 

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో