Cyclone Asani: వాయు వేగంతో దూసుకొస్తున్న ‘అసాని’ తుపాన్.. తీరప్రాంతాల్లో అలర్ట్..

దక్షిణ అండమాన్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం.. ఆదివారం ఉదయం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది.

Cyclone Asani: వాయు వేగంతో దూసుకొస్తున్న ‘అసాని’ తుపాన్.. తీరప్రాంతాల్లో అలర్ట్..
Asani Cyclone
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2022 | 3:17 PM

Asani Cyclone Updates: బంగాళాఖాతంలో ‘అసాని’ తుపాను వాయువేగంతో దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మరింత బలపడింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం.. ఆదివారం ఉదయం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ, వచ్చే 6 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఆ తర్వాత 24 గంటలకు బంగాళాఖాతంలో తుపానుగా పరిణామం చెందుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ నెల 10 నాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరానికి చేరుతుందని.. 10 లేదా 11వ తేదీన విశాఖపట్టణం, భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.

దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగముతో కొన్ని చోట్ల విచే అవకాశం ఉంది. అయితే.. దీనిగురించి ఇప్పుడే అంచనా వేయలేమని.. కానీ అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ సూచనలు చేసింది.

ఇదిలాఉంటే.. ఈ సారి వచ్చే తుపానుకు శ్రీలంక నామకరణం చేయనుంది. దాని ప్రకారం ‘అశని’ అనే పేరును ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. సింహళ భాషలో అశని అంటే.. కోపం, ఆగ్రహం అని అర్థం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

IAS Pooja Singhal: జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఈడీ దాడులు.. ఐఏఎస్ ఇంట్లో రూ.19 కోట్లు స్వాధీనం

Nitin Gadkari: దేశంలో భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. వచ్చే రెండేళ్లలో ఎన్నంటే..?