Amit Shah – Sourav Ganguly: దాదా ఇంట్లో అమిత్ షా డిన్నర్.. హీటెక్కిన బెంగాల్ రాజకీయం..
రెండు రోజుల పర్యటన నిమిత్తం కోల్‌కతాకు చేరుకున్న అమిత్ షా శుక్రవారం రాత్రి కోల్‌కతా నగరంలోని గంగూలీ నివాసానికి వెళ్లారు.
Amit Shah mets BCCI chief Sourav Ganguly: కేంద్ర హోంశాఖ మంత్రి పశ్చిమ బెంగాల్ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమిత్ షా… భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ ఇంట్లో విందు చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు జై షా భారత బీసీసీఐలో కార్యదర్శిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమిత్ షా గంగూలీ ఇంటికెళ్లి ఆయన్ను.. మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కోల్‌కతాకు చేరుకున్న అమిత్ షా శుక్రవారం రాత్రి కోల్‌కతా నగరంలోని గంగూలీ నివాసానికి వెళ్లారు. తన ఇంటికి వచ్చిన అమిత్ షాకు గంగూలీ ఆహ్వానం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న అనంతరం వారు కలిసి డిన్నర్ చేశారు. అయితే.. బీజేపీ నేతల సమక్షంలోనే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకోవడంతో గంగూలీ బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కాగా.. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. రాజకీయంగా ఎలాంటి చర్చలు జరగలేదని.. అమిత్ షా తనకు దశాబ్ద కాలంగా తెలుసునని, చాలాసార్లు అతన్ని కలిశానని తెలిపారు. మెను గురించి విలేకరులు అడగిన ప్రశ్నకు.. గంగూలీ నవ్వుతూ.. ఆయన శాఖహార వ్యక్తి అంటూ బదులిచ్చారు.
కాగా.. అమిత్ షా.. గంగూలీని అంతకుముందు పలుమార్లు కలిసి బీజేపీలో చేరాలంటూ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను గంగూలీ తిరస్కరిస్తూ వస్తున్నారు. గత ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైతం వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. గంగూలీ బిజెపిలో చేరతారా లేదా అనే ఊహాగానాలు 2015 నుంచి అడపాదడపాగా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు గంగూలీ బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. అదే నెలలో, మాజీ క్రికెటర్ గుండెపోటుకు గురయ్యారు. కాగా.. మరోసారి వీరిద్దరి మధ్య భేటీ జరగడంతో బెంగాల్ బీజేపీలో సందడి నెలకొంది. గంగూలీ బీజేపీలో చేరుతారా.. లేక ఎప్పటిలాగే ఉంటారా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Union Home Minister Amit Shah met with BCCI chief Sourav Ganguly and had dinner with him at his residence in Kolkata, West Bengal pic.twitter.com/dCn3TkgsT1
— ANI (@ANI) May 6, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: