Lemon Scam: అట్లుంటది నిమ్మకాయలతోని.. ఏకంగా జైలర్ సస్పెండ్.. అసలు మ్యాటర్ ఇదే..

జైలు రికార్డుల్లో 50 కిలోల నిమ్మకాయలు కొన్నట్లు ఉన్నా.. ఆ జైలులో ఉంటున్న ఖైదీలు మాత్రం త‌మ‌కు నిమ్మకాయలు ఇవ్వడం లేద‌ని ఆరోపించారు.

Lemon Scam: అట్లుంటది నిమ్మకాయలతోని.. ఏకంగా జైలర్ సస్పెండ్.. అసలు మ్యాటర్ ఇదే..
Lemon Scam
Follow us

|

Updated on: May 07, 2022 | 4:44 PM

Lemon Fraud in Kapurthala Jail: నిమ్మకాయల ధరలు గత కొంతకాలం నుంచి ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని కపుర్తలాలోని జైలులో జరిగిన నిమ్మకాయల కుంభ‌కోణం సంచలనంగా మారింది. దీంతో మోడ్రన్ జైలు అధికారిపై అధికారులు వేటు వేశారు. ఖైదీల ఆహారం కోసం కేటాయించిన నిధుల‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు మోడ్రన్ జైల‌ర్ గుర్నామ్ లాల్‌పై ఆరోప‌ణ‌లు వెల్లువత్తాయి. దీంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జైలు రికార్డుల్లో 50 కిలోల నిమ్మకాయలు కొన్నట్లు ఉన్నా.. ఆ జైలులో ఉంటున్న ఖైదీలు మాత్రం త‌మ‌కు నిమ్మకాయలు ఇవ్వడం లేద‌ని ఆరోపించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అధికారిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కాస్త వెలుగులోకి రావడంతో జైళ్ల శాఖ మంత్రి హ‌ర్జోత్ సింగ్ బెయిన్స్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు.

ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా నిమ్మకాయలకు భారీగా డిమాండ్ పెరిగిన విష‌యం తెలిసిందే. ఓ ద‌శ‌లో కిలో నిమ్మకాయల ధర రూ.500 లకు పైగా పలికింది. ఒక్కొక్క నిమ్మకాయ 15 నుంచి 20 వరకు అమ్ముడుపోయింది. అయితే.. ఖైదీల మెనూలో నిమ్మకాయ‌ల‌ను సైతం యాడ్ చేయడంతో ఈ వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ సమయంలో త‌నిఖీ కోసం వెళ్లిన అధికారులు.. ఖైదీలు చెప్పిన విషయం తెలుసుకోని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మెనూలో నిమ్మకాయ‌లు ఉన్నా.. ఇవ్వడం లేవ‌ని ఖైదీలు అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క చ‌పాతీ బ‌రువు కూడా 50 గ్రాముల క‌న్నా త‌క్కువ ఉందని.. కూర‌గాయ‌ల్లో కూడా అక్రమాలు జ‌రిగిన‌ట్లు అధికారులు నిర్ధారించారు. అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలడంతో జైల‌ర్ గుర్నామ్ లాల్‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

CM Stalin: ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న స్టాలిన్‌.. మరో ఐదు కొత్త పథకాలకు శ్రీకారం..

Amit Shah – Sourav Ganguly: దాదా ఇంట్లో అమిత్ షా డిన్నర్.. హీటెక్కిన బెంగాల్ రాజకీయం..