Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్.. ఏ విషయంలో అంటే..?
ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వ్యవహారాలను నాలుగు గోడల మధ్యే చర్చించాలని, మీడియాతో మాట్లాడే వారు పార్టీకి నష్టం చేసినట్లేనని రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
Rahul Gandhi in Telangana: పొత్తులు, టిక్కెట్ల విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి తెలంగాణ పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. TRSతో ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వ్యవహారాలను నాలుగు గోడల మధ్యే చర్చించాలని, మీడియాతో మాట్లాడే వారు పార్టీకి నష్టం చేసినట్లేనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో ఉండే వారికే టిక్కెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో కూర్చోవద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని స్పష్టంగా చెప్పారు. వరంగల్ డిక్లరేషన్‌ను రాబోయే 30 రోజుల్లో ప్రతి గ్రామంలోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని, 12 ఏళ్ల కుర్రాడికి కూడా అందులోని అంశాలను వివరించాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పని చేస్తే పార్టీ విజయం ఖాయమని చెప్పారు రాహుల్. తెలంగాణ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్‌కు వచ్చిన రాహుల్ గాంధీ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు. పనిచేసిన వారికే పార్టీ టికెట్లు దక్కుతాయంటూ పేర్కొన్నారు. పనిచేయని వారిని పక్కన పెడతామంటూ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై కూడా రాహుల్ మాట్లాడారు. మెరిట్ ఆధారంగా, రైతులు, సమస్యలపై పోరాడే వారికే టికెట్లు కేటాయిస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడాను చూడబోమని కూడా వివరించారు. పార్టీ కోసం పనిచేయని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు దక్కవన్నారు. హైదరాబాద్‌లో కూర్చుంటే, ఢిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావన్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే హైదరాబాద్‌ను వదిలి నేతలు గ్రామాల బాట పట్టాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..