PBKS vs RR Live Score: అర్ధసెంచరీతో రాణించిన బెయిర్ స్టో.. చివర్లో జితేశ్ మెరుపులు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..
IPL 2022: ఓపెనర్ జానీ బెయిర్ స్టో (40 బంతుల్లో 56) అర్ధసెంచరీకి తోడు చివర్లో జితేశ్ శర్మ (18 బంతుల్లో 38, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ (PBKS vs RR)లో పంజాబ్ జట్టు భారీ స్కోరు సాధించింది.
IPL 2022: ఓపెనర్ జానీ బెయిర్ స్టో (40 బంతుల్లో 56) అర్ధసెంచరీకి తోడు చివర్లో జితేశ్ శర్మ (18 బంతుల్లో 38, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ (PBKS vs RR)లో పంజాబ్ జట్టు భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు బెయిర్ స్టో శుభారంభం అందించాడు. అయితే మరో ఓపెనర్ ధావన్ (12) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలోనే భారీ షాట్‌కు యత్నించి అశ్విన్‌కు చిక్కాడు. ఆతర్వాత భానుక రాజపక్సే (18 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని భారీ షాట్లు ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్ మయాంక్ (15) మరోసారి నిరాశపర్చాడు. అయితే జితేశ్ శర్మకు లివింగ్ స్టోన్ (14 బంతుల్లో 22) జత కలవడంతో పంజాబ్ స్కోరుబోర్డు పరుగులెత్తింది. వీరిద్దరూ నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 22 బంతుల్లోనే 50 పరుగులు జోడించడం విశేషం. లివింగ్ స్టోన్ ఔటౌనా కుల్‌దీప్ సేన్ వేసిన చివర్లో జితేశ్ చుక్కలు చూపించాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో మొత్తం 16 పరుగులు పిండుకున్నాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి 189/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇక రాజస్థాన్ బౌలింగ్ విషయానికొస్తే.. యుజువేంద్ర చాహల్ మరోసారి ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన అతను 28 పరుగులిచ్చి కీలకమైన బెయిర్‌స్టో, రాజపక్సే, మయాంక్ వికెట్లను తీశాడు. మరో స్పిన్నర్ అశ్విన్(32/1) ఆకట్టుకోగా ప్రసిద్ధ్ కృష్ణ (48/1), కుల్‌దీప్ సేన్ (42/1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: