LSG vs KKR Highlights: రాణించిన లక్నో బౌలర్లు.. కోల్‌కత్తాపై 75 పరుగుల తేడాతో విజయం..
KKR Vs LSG: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా పుణేలలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 101 పరుగులకే కుప్పకూలింది.
LIVE Cricket Score & Updates
-
లక్నో సూపర్ జెయింట్స్ విజయం
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
-
ఏడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఏడో వికెట్ కోల్పోయింది. అనుకుల్ రాయ్ పెవిలియన్ చేరాడు.
-
-
రసెల్ ఔట్..
కోల్‌కత్తా ఆరో వికెట్ కోల్పోయింది. రసెల్ ఔటయ్యాడు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా
కోల్‌కత్తా నాలుగో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా ఔటయ్యాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..
అరోన్ ఫించ్ (14) రూపంలో కోల్‌కతా టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 5. 4 ఓవర్లకు కేకేఆర్ టీం 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ఖాన్, చమీరా, హోల్డర్ తలో వికెట్ పడగొట్టారు.
-
-
రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా టీంకు ఆదిలోనే షాక్‌లమీద షాకులు తగులుతున్నాయి. తొలి ఓవర్‌లో బాబా ఇంద్రజీత్ (0) పెవిలియన్ చేరగా, 4వ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్(6) పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ఖాన్, చమీరా తలో వికెట్ పడగొట్టారు.
-
తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా టీంకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. బాబా ఇంద్రజీత్ (0) రూపంలో కేకేఆర్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ఖాన్ బౌలింగ్‌లో బదోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
కోల్‌కతా నైట్ రైడర్స్ టార్గెట్ 177
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 177 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లక్నో టీం తరపున డికాక్ 50(29 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
-
ఐదో వికెట్ కోల్పోయిన లక్నో..
స్టోయినీస్ (28 పరుగులు, 14 బంతులు, 1 ఫోర్, 3 సిక్సులు) రూపంలో లక్నో టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. శివం మావీ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 18.4 ఓవర్లలో లక్నో టీం 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
-
16 ఓవర్లకు లక్నో స్కోర్..
16 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం 4 వికెట్లు కోల్పోయి 126 పరుగులు సాధించింది. స్టోయినీస్ 3, ఆయుష్ బదోని 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో..
పాండ్యా (25 పరుగులు, 27 బంతులు, 2 ఫోర్లు) రూపంలో లక్నో టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. రస్సెల్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 14.5 ఓవర్లలో లక్నో టీం 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ కోల్పోయిన లక్నో..
దీపక్ హుడా (41 పరుగులు, 27 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో లక్నో టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. రస్సెల్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో 12.4 ఓవర్లలో లక్నో టీం 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.
-
9 ఓవర్లకు లక్నో స్కోర్..
9 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం రెండు వికెట్లు కోల్పోయి 79 పరుగులు సాధించింది. దీపక్ హుడా 26, పాండ్యా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన లక్నో..
డికాక్ (50 పరుగులు, 29 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో శివం మావి అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.
-
6 ఓవర్లకు లక్నో స్కోర్..
6 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం ఒక వికెట్ కోల్పోయి 66 పరుగులు సాధించింది. డికాక్ 44(23 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దీపక్ హుడా 22(13 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
3 ఓవర్లకు లక్నో స్కోర్..
3 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు సాధించింది. డికాక్ 19(12 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా 10(6 బంతులు, 2 ఫోర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన లక్నో..
టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన లక్నో టీంకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ విసిరిన త్రోకు రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.
-
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు..
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఆరోన్ ఫించ్, బాబా ఇంద్రజిత్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్ మావి, హర్షిత్ రాణా
-
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్
-
Lucknow vs Kolkata, LIVE Score: డూ ఆర్ డై మ్యాచ్‌లో తలపడనున్న కోల్‌కతా..
ఇది కోల్‌కతాకు డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. నేటి మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోతే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోనుంది. ఆ తర్వాత పునరాగమనం చేయడం చాలా కష్టం.
-
Lucknow vs Kolkata, LIVE Score: లక్నో టీంతో పోరుకు సిద్ధమూన కోల్‌కతా
ఐపీఎల్ 2022లో నేటి రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ కోల్‌కతాతో తలపడనుంది. లక్నో తొలిసారి లీగ్‌లో ఆడుతుండగా ఇరు జట్లు తొలిసారి తలపడుతున్నాయి.
Published On - May 07,2022 6:55 PM