ఆ జట్టుతో తలపడేందుకు అమెరికా వెళ్లనున్న టీమిండియా.. ఐపీఎల్ తర్వాత రోహిత్ సేన ఫుల్ బిజీ.. షెడ్యూల్ ఇదే..
Team India: స్వదేశంలో జరిగిన సిరీస్ తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ వెళ్లనుంది. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది. మే 29న ఐపీఎల్ ఫైనల్..
సౌతాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. అక్కడి నుంచి నేరుగా జూలై రెండో వారంలో వెస్టిండీస్‌కు వెళ్తుంది. రోహిత్ నేతృత్వంలోని టీమిండియా 8 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. క్రికెట్ వెబ్‌సైట్ Cricbuzz ప్రకారం, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (CWI) మధ్య ఒక ప్రణాళిక సిద్ధమైంది. ప్రతిపాదిత ఐదు T20 మ్యాచ్‌లలో చివరి రెండు 2 మ్యాచ్‌లు USలో ఆడాల్సి ఉంది. అమెరికన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ నుంచి అనుమతి పొందిన వెంటనే BCCI, CWI అధికారిక ప్రకటన చేయనున్నాయి.
Also Read: IPL 2022: 21 బంతులు, 200లకు పైగా స్ట్రైక్ రేట్.. బౌలర్లను ఉతికారేసిన రూ. 8.25 కోట్ల ప్లేయర్.. ఎవరంటే?
స్వదేశంలో జరిగిన సిరీస్ తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ వెళ్లనుంది. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది. మే 29న ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత జూన్ మధ్యలో జట్టు ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉంది. అంతకు ముందు ఐర్లాండ్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఇంగ్లండ్ టూర్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.
మీడియా కథనాల ప్రకారం, టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన జులై 17న ముగుస్తుంది. వెస్టిండీస్ పర్యటన జులై 22న ప్రారంభమవుతుంది. ఆసియా కప్ 2022కి ముందు టీమ్ ఇండియాకు ఇదే చివరి పర్యటన. కరీబియన్ టూర్‌లో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది.
భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జూలై 22న, రెండో వన్డే జూలై 24న, మూడో వన్డే జూలై 27న జరగనుంది. జూలై 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇది చార్లెస్ లారా స్టేడియంలో జరుగుతుంది. రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 1న, మూడో టీ20 ఆగస్టు 2న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లోని వార్నర్ పార్క్‌లో జరగనుంది. ఆ తర్వాత ఇరుజట్లు ఫ్లోరిడా వెళ్లనున్నాయి. అక్కడ నాలుగో మ్యాచ్ ఆగస్టు 6న, చివరి మ్యాచ్ ఆగస్టు 7న జరగనుంది. ఆ తర్వాత 2022 ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా శ్రీలంక వెళ్లనుంది.