PBKS vs RR, IPL 2022: తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన జైస్వాల్.. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలకు చెక్!
PBKS vs RR, IPL 2022: శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగినమ్యాచ్ (PBKS vs RR)లో పంజాబ్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రాజస్థాన్. ప్రత్యర్థి విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు ఉండగానే ఛేదించింది శామ్సన్ సేన.
PBKS vs RR, IPL 2022: చాలా రోజుల నుంచి డగౌట్‌కే పరిమితమైన యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అదరగొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను మళ్లీ విజయాల బాట పట్టించాడు. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగినమ్యాచ్ (PBKS vs RR)లో పంజాబ్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రాజస్థాన్. ప్రత్యర్థి విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు ఉండగానే ఛేదించింది శామ్సన్ సేన. యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగగా, హెట్మెయిర్ (16 బంతుల్లో 31) మెరుపులు మెరిపించాడు. దేవ్‌దత్ పడిక్కల్ (31), బట్లర్ (30) సమష్ఠిగా రాణించడంతో రాజస్థాన్ భారీ లక్ష్యాన్ని సులువుగా అధిగమించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (29/2) మినహా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రబాడా (50/1), సందీప్ శర్మ(41/0), చాహర్(39/0) పూర్తిగా నిరాశపర్చారు. కాగా ఈ టోర్నీలో RRకు ఇది ఏడో విజయం. దీంతో మొత్తం 14 పాయింట్లతో తన ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది శామ్సన్ సేన. మరోవైపు టోర్నీలో ఆరో పరాజయాన్ని మూట గట్టుకున్న పంజాబ్ ఫ్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సూపర్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్‌కు బెయిర్ స్టో శుభారంభం అందించాడు. అయితే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (12) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలోనే భారీ షాట్‌కు యత్నించి అశ్విన్‌కు చిక్కాడు. ఆతర్వాత భానుక రాజపక్సే (18 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని భారీ షాట్లు ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కెప్టెన్ మయాంక్ (15) మరోసారి నిరాశపర్చాడు. అయితే జితేశ్ శర్మ (18 బంతుల్లో 38, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్ స్టోన్ (14 బంతుల్లో 22) జత కలవడంతో పంజాబ్ స్కోరుబోర్డు పరుగులెత్తింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 22 బంతుల్లోనే 50 పరుగులు జోడించడంతో 20 ఓవర్లు ముగిసే సరికి 189/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Take an opportunity and grab it with all you’ve got.@yashasvi_j ?? pic.twitter.com/SlDy8gQAfV
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: