- Telugu News Photo Gallery Things banned for afghan women from nail polish to driving and high heels the taliban have imposed these strange restrictions on women In Telugu
Things Banned For Afghan Women: నెయిల్ పాలిష్ నుంచి హైహీల్స్ వరకు.. అఫ్గాన్ మహిళలపై ఉన్న ఆంక్షలివే..
ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు తమ క్రూరత్వానికి మొదట మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. మహిళలపై అన్ని రకాల ఆంక్షలు విధించడం ప్రారంభించారు
Updated on: May 07, 2022 | 7:09 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు తమ క్రూరత్వానికి మొదట మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. మహిళలపై అన్ని రకాల ఆంక్షలు విధించడం ప్రారంభించారు. దీంతో వారు పంజరంలో పక్షుల్లా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మహిళలు డ్రైవింగ్ చేయడంపై తాలిబన్లు నిషేధం విధించారు.

అంతకుముందు మహిళలు ఒంటరిగా ప్రయాణించడం లేదా వాహనంలో ఎక్కువ దూరం ప్రయాణించడంపై కూడా ఆంక్షలు విధించారు. బస్సులో మహిళలు ఒంటరిగా 70 కిలోమీటర్లకు మించి ప్రయాణించకూడదని ఆదేశించారు. అంతకుమించి దూరం వెళ్లాలంటే భర్త లేదా సోదరుడిని తోడుగా తీసుకెళ్లాలని నిబంధనలు జారీ చేశారు.

తాలిబాన్ పాలన ఎంత క్రూరంగా ఉందంటే అక్కడి మహిళలు హైహీల్స్ కూడా ధరించలేరు.

ఇక్కడ మహిళలు మేకప్ కూడా వేసుకోకూడదు. అలాగే గోళ్లకు నెయిల్ పాలిష్ కూడా వేసుకోవడం నిషిద్ధం.

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు గట్టిగా మాట్లాడిన కూడా అక్కడ నేరమే. అదేవిధంగా వారు బాల్కనీలో కూడా నిలబడకూడదన్న ఆంక్షలు కూడా ఉన్నాయి.

અફઘાનિસ્તાનમાં મહિલાઓને ફોટોગ્રાફ લેવા, વિડિયો બનાવવા અથવા કોઈપણ રીતે કેમેરા સામે આવવાની મનાઈ છે. તેમને એક્સપોઝ થવા પર પ્રતિબંધિત છે.

అఫ్గాన్ మహిళలు రేడియో, టీవీల్లో పని చేయకూడదు. బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొనకూడదు. అదేవిధంగా ఉన్నత చదువులు అభ్యసించడంపై కూడా ఆంక్షలున్నాయి.


Things Banned in Afghanistan For Women




