Happy Mother’s Day: లక్నో టీం మదర్స్ డే స్పెషల్ అదిరిపోయిందిగా.. సలాం చేస్తోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో..
ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ప్రత్యేక జెర్సీతో రానుంది. దానికి ఓ కారణం కూడా ఉంది. మే 8వ తేదీ ఆదివారం మదర్స్ డేని పురస్కరించుకుని టీమ్ ఈ స్పెషల్ జెర్సీతో రంగంలోకి దిగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 53వ(IPL 2022) మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో లక్నో(Lucknow Super Giants) తలపడనుంది. ఈ మ్యాచ్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ముంబైలో జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోకు చాలా ప్రత్యేకమైనదిగా మారనుంది. మరో విజయం సాధిస్తే(lsg vs kkr) ప్లేఆఫ్ రేసులో కేఎల్ రాహుల్ సేన బెర్త్‌ను సొంతం చేసుకోనుంది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో గుజరాత్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ప్రత్యేక జెర్సీతో రానుంది. దానికి ఓ కారణం కూడా ఉంది. మే 8వ తేదీ ఆదివారం మదర్స్ డేని పురస్కరించుకుని టీమ్ ఈ స్పెషల్ జెర్సీతో రంగంలోకి దిగనుంది.
Also Read: Watch Video: చివరి ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ.. హీరోగా మారిన విలన్.. ఆ రూ.2.60 కోట్ల బౌలర్ ఎవరంటే?
ఈ జెర్సీ ఎందుకు ప్రత్యేకం?
మే 8న మదర్స్ డేని పురస్కరించుకుని కోల్‌కతాపై లక్నో జట్టు ప్రత్యేక జెర్సీని ధరించనుంది. అందులో ఆటగాళ్ల తల్లి పేరుతో రాసిన ప్రత్యేక జెర్సీలను ధరించనున్నారు. తల్లి అంకితభావంతో పాటు ఆమె చేసిన త్యాగాలకు గుర్తుగా ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేక అవకాశంగా భావిస్తున్నట్లు ఫ్రాంచైజీ పేర్కొంది. దీంతో లక్నో జట్టు ప్రత్యేక సెంటిమెంట్‌తో తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు సిద్ధమైంది. ఈమేరకు లక్నో సూపర్ జెయింట్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో సూపర్ జెయింట్‌గా మదర్స్ డే కోసం సిద్ధం చేసుకోండి అంటూ రాసుకొచ్చారు.
మ్యాచ్ గురించి మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లక్నోకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కోల్‌కతాను ఓడించగలిగితే, జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోవడం ఖాయంగా మారనుంది. మరోవైపు కోల్‌కతా జట్టు ఇప్పటికే ఈ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం జట్టు 8వ స్థానంలో ఉంది. శుభారంభం తర్వాత ఆ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ జట్టు 10 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలతో 8 పాయింట్లు సాధించింది. మరోవైపు లక్నో జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
“This one’s for you, Maa.” Now THAT’s how you prepare for Mother’s Day – the #SuperGiant way! #AbApniBaariHai?#IPL2022 ? #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/H4CNkJZ6LF
— Lucknow Super Giants (@LucknowIPL) May 7, 2022