IGNOU Admit Card: బీఈడీ, బీఎస్పీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
IGNOU Admit Card: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) B.Ed ఎంట్రన్స్ ఎగ్జామ్, B.Sc నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.
IGNOU Admit Card: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) B.Ed ఎంట్రన్స్ ఎగ్జామ్, B.Sc నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు పరీక్షలు మే 8, 2022న నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు ID పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసే ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
ఇగ్నో ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా..?
1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించండి.
2. హోమ్‌పేజీలో, B.Ed ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ లేదా B.Sc నర్సింగ్ ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
3. మొబైల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
4. మీ IGNOU అడ్మిట్ కార్డ్ 2022 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5. దీన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
కరోనా నిబంధనలు పూర్తిగా పాటించాలి
పరీక్ష సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డులను కలిగి ఉండాలి. అడ్మిట్ కార్డు లేని అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష, CBT మోడ్‌లో నిర్వహిస్తారు. పరీక్ష సమయంలో అభ్యర్థులు అన్ని COVID-19 భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఇగ్నో అధికారులు సూచించారు.
మే 8వ తేదీన పరీక్ష
ఇగ్నో మే 8, 2022న B.Ed, పోస్ట్ బేసిక్ B.Sc నర్సింగ్ పరీక్షల ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని నిర్వహిస్తోంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇచ్చిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఏదైనా పొరపాటు కనిపిస్తే వెంటనే IGNOUని సంప్రదించి సరిదిద్దుకోవచ్చు.
మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి