NEET UG 2022 exam date: నీట్‌ యూజీ 2022 రిజిస్ట్రేషన్‌ తుది గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET (UG)-2022) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

NEET UG 2022 exam date: నీట్‌ యూజీ 2022 రిజిస్ట్రేషన్‌ తుది గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
NEET UG 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 07, 2022 | 7:50 PM

NEET UG 2022 Application last date: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET (UG)-2022) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మే 15 రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగించింది. మే 15 రాత్రి 11 గంటల 50 నిముషాల వరకు దరఖాస్తు రుసుము చెల్లించడానికి అవకాశం కల్పించింది. కాగా నీట్‌ యూజీ దరఖాస్తు ప్రక్రియ మే 6తో ముగియనుండగా.. విద్యార్ధుల అభ్యర్ధన మేరకు చివరి తేదీని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులెవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ neet.nta.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1600, జనరల్, ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులకు రూ. 900లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ జూలై 17న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, వెటర్నరీ కోర్సులు వంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు

Also Read:

NBCC Recruitment 2022: నెలకు రూ.240000 జీతంతో..నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు..