హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి, పశ్చిమ వాయువ్య దిశగా కదిలే సూచనలున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరుగా, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. పిడుగుల ప్రమాదంపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.