AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

హోం మంత్రి అనిత అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. తన సొంత శాఖలో సమీక్షలు చేస్తూనే రాష్ట్ర రాజకీయాలపై తమదైన శైలిలో స్పందించడంలో ఆమెది డిఫరెంట్ స్టైల్. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడంలో ముందు వరసలో ఉన్న కూటమినేతల్లో ఆమె ఒకరు. మహిళా నేతల్లో బహుశా ఆమెది ఫస్ట్ ప్లేస్. ఇక.. తన బిజీ లైఫ్లో కాస్త సమయం దొరికినప్పుడల్లా ప్రజల్లో మమేకమవుతుంటారు. అదే సమయంలో కాస్త రిలాక్స్ అయ్యేందుకు తనకు నచ్చిన పని చేయడానికి వెనుకాడరు. ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటారు.

Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!
Home Minister Anitha
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 21, 2026 | 11:17 PM

Share

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా హోం మంత్రి అనితకు ఓ బజ్జి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళెంత! అనకాపల్లి జిల్లా ఉపమాకలో జరుగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఉపమాక వెంకన్న దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను తీసుకొచ్చి మంత్రికి అందజేశారు స్థానికులు. వాటిని రుచి చూసిన మంత్రి అనిత ఇష్టంగా తిన్నారు. ఇంకేముంది వాటి టేస్ట్‌కు ఫిదా అయ్యారు.

దీంతో స్వయంగా ఆమె ఆ షాప్ లోకి వెళ్లి.. కొద్దిసేపు బజ్జీలు వేశారు. వేడి వేడి నూనెలో శెనగ పిండిలో కలిపిన అరటి, మిర్చి బజ్జిలను వేసి వేయించ్చారు. ఇలా ఎకంగా హోంమంత్రినే తమ దుకాణానికి రావడం, బజ్జిలు తినడమే కాకుండా, బజ్జీలు వేయడంతో ఆ దుకాణదారుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతేకాదు ఆ దృశ్యాలు చూసిన వారంతా చూస్తూ ఉండిపోయారు.

మరికొందరైతే మంత్రి బజ్జీలు వేస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అంతేకాకుండా సమీపంలోని ఓ పాన్ షాప్‌లోకి వెళ్లిన మంత్రి అక్కడి వ్యాపారులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి వ్యాపార పరిస్థితులు, సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us