AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICE Tea Side Effects: వేసవిలో ఐస్‌ టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే దాని జోలికి అస్సలు వెళ్లరు..!

ICE Tea Side Effects: వేసవిలో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందడానికి అనేక ఆహార పదార్థాలు, పానీయాలని తీసుకుంటారు. ఇవి శరీరాన్ని లోపలి నుంచి చల్లగా

ICE Tea Side Effects: వేసవిలో ఐస్‌ టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే దాని జోలికి అస్సలు వెళ్లరు..!
Ice Tea
uppula Raju
|

Updated on: May 07, 2022 | 8:15 PM

Share

ICE Tea Side Effects: వేసవిలో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందడానికి అనేక ఆహార పదార్థాలు, పానీయాలని తీసుకుంటారు. ఇవి శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచుతాయని భావిస్తారు. ముఖ్యంగా చాలామంది కూల్ డ్రింక్స్, ఐస్‌ టీ ఎక్కువగా తాగుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి కొంత సమయం వరకే ఉపశమనం కలిగించగలవు. కానీ వీటివల్ల చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. వేసవిలో చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో నిల్వ ఉన్న కొవ్వు కరగదు. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కూలింగ్ డ్రింక్స్ తక్కువగా తీసుకోవడం మంచిది. వేసవి కాలంలో చాలా మంది ఐస్ టీని ఎక్కువగా తాగుతుంటారు. రుచిలో అత్యుత్తమమైన ఐస్ టీ ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని చేస్తుంది. ఐస్ టీ వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. స్ట్రోక్ ప్రమాదం

ఐస్ టీ వల్ల స్ట్రోక్ లేదా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఐస్‌ టీ అనేది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతుంది. అదనంగా ఇది శరీరంలో చక్కెర మొత్తాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఐస్ టీని ఎంత అవైడ్‌ చేస్తే అంత మంచిది.

2. నిద్ర సమస్యలు

నిద్ర సమస్యలు ఉన్నవారు ఐస్‌ టీ తీసుకోకుండా ఉండాలి. ఇందులో ఉండే కెఫిన్ నిద్ర వ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల గంటల తరబడి మెలకువగా ఉండాల్సి వస్తుంది.

3. మూత్రపిండాల నష్టం

ఐస్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలేయ వైఫల్యానికి దారి తీస్తుంది. ఐస్ టీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయి. మీరు ఇప్పటికే ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధిని ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజు నుండి ఐస్‌ టీ తాగడం మానేయండి.

4. బరువు పెరగవచ్చు

ఐస్ టీ వల్ల బరువు పెరుగుతారు. కొవ్వు సమస్య ఉన్నవారు ఐస్ టీని తాగకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొంతమంది బరువు తగ్గడంలో ఐస్ టీ ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తారు. కానీ ఇది శరీరంలో ఉన్న కొవ్వును పెంచుతుంది. దీంతో మీరు విపరీతంగా బరువు పెరుగుతారు.

అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mileage Bikes: ఇండియాలో తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఐదు బైక్‌లు ఇవే..!

IGNOU Admit Card: బీఈడీ, బీఎస్పీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ కోసం అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..!

Mahatama Gandhi: బ్రిటన్‌లో మహాత్మాగాంధీ వస్తువులు వేలం.. ఏ ఏ వస్తువులు వేలం వేస్తున్నారంటే..?