AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs DC: ఇరగదీసిన చెన్నై బౌలర్లు.. తేలిపోయిన ఢిల్లీ బ్యాటర్లు..

CSK vs DC: ఐపీఎల్ 2022లో భాగంగా 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

CSK vs DC: ఇరగదీసిన చెన్నై బౌలర్లు.. తేలిపోయిన ఢిల్లీ బ్యాటర్లు..
Csk Vs Dc
uppula Raju
|

Updated on: May 08, 2022 | 11:35 PM

Share

CSK vs DC: ఐపీఎల్ 2022లో భాగంగా 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ కేవలం 17.4 ఓవరల్లో 117 పరుగులకే చేతులెత్తేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్‌ ఎవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు. శార్దుల్‌ ఠాగూర్‌ 24 పరుగులు, రిషబ్‌ పంత్‌ 21 పరుగులు చేశారు. జట్టులో ఎవ్వరూ 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, డ్వేన్‌ బ్రేవో 2, ముఖేష్‌ చౌదరీ2, సిమర్‌జీత్ సింగ్ 2, మహేశ్ తీక్షణ 1 వికెట్‌ సాధించారు. ఈ ఓటమితో దిల్లీ (10 పాయింట్లు) తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు అద్భుత విజయం సాధించిన చెన్నై (8) పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 209 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. చెన్నై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. సెంచరీ భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ 41 పరుగులు చేసిన తర్వాత నార్ట్జే బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వీరిద్దరి మధ్య 110 పరుగుల భాగస్వామ్యం అందించారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి డేవాన్ కాన్వే మరోసారి కీలక భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరి మధ్య 59 పరుగుల భాగస్వామ్యం తర్వాత.. కాన్వే (87 పరుగులు, 49 బంతులు, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శివం దూబే 32 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, అంబటి రాయుడు 5, అలీ 9, ఉతప్ప 0 పరుగులు చేశారు. ఇక చివర్లో ధోనీ (21 పరుగులు, 8 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు) మార్క్ ఇన్నింగ్స్ ఆడడంతో పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. మరోవైపు ఢిల్లీ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. చివర్లో వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్ 2, నార్ట్జే 3, మార్ష్ 1 వికెట్ పడగొట్టారు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: పెళ్లిలో గాఢ నిద్రలోకి జారుకున్న వధువు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫన్నీ వీడియో..!

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతం.. రాజపక్సే ఆఫర్‌ను తిరస్కరించిన ప్రేమదాస

Viral Video: పెళ్లిలో ఫొటోగ్రాఫర్‌ చిలిపి చేష్టలు.. పెళ్లికూతురు రియాక్షన్‌ చూస్తే..