CSK vs DC Score: అదరగొట్టిన చెన్నై.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కాన్వే.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్..

Chennai Super Kings vs Delhi Capitals: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 209 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

CSK vs DC Score: అదరగొట్టిన చెన్నై.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కాన్వే.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్..
Csk Vs Dc Ipl 2022
Follow us

|

Updated on: May 08, 2022 | 9:38 PM

CSK vs DC Score: ఐపీఎల్ 2022లో భాగంగా 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట్లస్ టీంలు తలపుడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 209 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. చెన్నై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. సెంచరీ భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ 41 పరుగులు చేసిన తర్వాత నార్ట్జే బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వీరిద్దరి మధ్య 110 పరుగుల భాగస్వామ్యం అందించారు.

Also Read: SRH vs RCB, IPL 2022: హసరంగా పాంచ్‌ పటాకా.. హైదరాబాద్‌కు వరుసగా నాలుగో ఓటమి.. సన్నగిల్లిన ప్లే ఆఫ్‌ అవకాశాలు!

అనంతరం క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి డేవాన్ కాన్వే మరోసారి కీలక భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరి మధ్య 59 పరుగుల భాగస్వామ్యం తర్వాత.. కాన్వే (87 పరుగులు, 49 బంతులు, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శివం దూబే 32 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, అంబటి రాయుడు 5, అలీ 9, ఉతప్ప 0 పరుగులు చేశారు. ఇక చివర్లో ధోనీ (21 పరుగులు, 8 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు) మార్క్ ఇన్నింగ్స్ ఆడడంతో పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. మరోవైపు ఢిల్లీ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. చివర్లో వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్ 2, నార్ట్జే 3, మార్ష్ 1 వికెట్ పడగొట్టారు.

ఇరు జట్లు..

ఇవి కూడా చదవండి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్ట్జే

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ఢిల్లీ జట్టుకు మరోషాక్.. హాస్పిటల్‌లో చేరిన కీలక ప్లేయర్.. ఎందుకంటే?

3 ఏళ్లుగా విమర్శలు.. రిటైర్మెంట్ చేయాలంటూ సలహాలు.. కట్ చేస్తే.. వరుస సెంచరీలతో స్పీడ్ పెంచిన టీమిండియా ప్లేయర్..