SRH vs RCB, IPL 2022: హసరంగా పాంచ్ పటాకా.. హైదరాబాద్‌కు వరుసగా నాలుగో ఓటమి.. సన్నగిల్లిన ప్లే ఆఫ్ అవకాశాలు!
SRH vs RCB, IPL 2022: కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుత ఇన్నింగ్స్ (73)కు తోడు స్పిన్నర్ వనిందు హసరంగ (18/5) పదునైన బౌలింగ్ ముందు హైదరాబాద్ జట్టు నిలవలేకపోయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 125 పరుగులకే చతికిలపడింది.
SRH vs RCB, IPL 2022: ఐపీఎల్ -2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఎట్టకేలకు ఓ భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ (SRH vs RCB)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 67 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది డుప్లెసిస్ సే. తద్వారా ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో బెంగళూరుకు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుత ఇన్నింగ్స్ (73)కు తోడు స్పిన్నర్ వనిందు హసరంగ (18/5) పదునైన బౌలింగ్ ముందు హైదరాబాద్ జట్టు నిలవలేకపోయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 125 పరుగులకే చతికిలపడింది. కాగా బెంగళూరు విజయంతో ఈ సీజన్ ప్రారంభంలో హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం 68 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ నెట్ రన్‌రేట్ కూడా బాగా మెరుగుపడింది. కాగా హైదరాబాద్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి. ఐదు వికెట్లు తీసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన హసరంగాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
193 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తడబడింది. మొదటి ఓవర్లోనే కెప్టెన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ వికెట్లను కోల్పోయింది. అయితే మర్‌క్రమ్, త్రిపాఠి జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే మర్‌క్రమ్ ఔటైన తర్వాత సన్‌రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హసరంగా ధాటికి నికోలస్ పూరన్, సుచిత్, శశాంక్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. రాహుల్ త్రిపాఠి (57) ఒంటరిపోరాటం చేసినా అది ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించడానికే సరిపోయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. డుప్లెసిస్‌కు తోడు పటిదార్ (48), మ్యాక్స్ వెల్(33), దినేశ్ కార్తీక్ (30) తలా ఓచేయి వేయడంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Brilliant performances with the bat and ball. ✅ 2️⃣ points in the bag. ✅
A #GoGreen Game we will remember for a long time to come. ?#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #ForPlanetEarth #SRHvRCB pic.twitter.com/ZcjkqKDkTW
— Royal Challengers Bangalore (@RCBTweets) May 8, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: