AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheteshwar Pujara: కౌంటీల్లో అదరగొడుతోన్న నయా వాల్‌.. పాక్‌ స్పీడ్‌స్టర్‌కు ఎలా చుక్కలు చూపించాడో మీరే చూడండి..

ఇప్పటికే రెండు డబుల్‌ సెంచరీలు, ఒక సెంచరీ బాదిన పుజారా తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లోనూ మెరిశాడు. కౌంటీ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో సెంచరీ కొట్టాడు.ఇప్పటికే రెండు డబుల్‌ సెంచరీలు, ఒక సెంచరీ బాదిన పుజారా తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లోనూ మెరిశాడు. కౌంటీ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో సెంచరీ కొట్టాడు.

Cheteshwar Pujara: కౌంటీల్లో అదరగొడుతోన్న నయా వాల్‌.. పాక్‌ స్పీడ్‌స్టర్‌కు ఎలా చుక్కలు చూపించాడో మీరే చూడండి..
Cheteshwar Pujara
Basha Shek
|

Updated on: May 08, 2022 | 4:08 PM

Share

టీమిండియా క్రికెటర్లందరూ ఐపీఎల్‌లో బిజీబిజీగా ఉంటుంటే ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) మాత్రం కౌంటీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. ససెక్స్‌ టీంకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను టీమిండియాలోకి రావాలనే లక్ష్యంతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే రెండు డబుల్‌ సెంచరీలు, ఒక సెంచరీ బాదిన పుజారా తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లోనూ మెరిశాడు. కౌంటీ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో సెంచరీ కొట్టాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి (149 బంతుల్లో 125 బ్యాటింగ్‌, 16 ఫోర్లు, 2 సిక్సర్లు)తో క్రీజులో ఉన్నాడు. కాగా పుజారా చలవతో ప్రస్తుతం 270 పరుగుల ఆధిక్యంలో ఉంది ససెక్స్‌. అంతకుముందు మిడిలెసెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌటైంది.

కళ్లు చెదిరే సిక్సర్‌తో..

ఇవి కూడా చదవండి

కాగాఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పుజారా పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఓ సూపర్‌ సిక్సర్‌ బాదాడు. మెరుపు వేగంతో నేరుగా దూసుకొచ్చిన బంతిని అప్పర్‌కట్‌ షాట్‌ ఆడడంతో బంతి నేరుగా స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పుజారా అప్పర్‌కంట్‌ లాంటి షాట్లు ఆడడం అరుదు. ఇక పుజారా, అఫ్రిదిలు ఎదురుపడడం ఇదే తొలిసారి. కాగా టెస్ట్‌ స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన పుజారా గత కొంతకాలంగా వరుసగా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. టీమిండియాలో అతనికి చోటుపై సందేహాలు తలెత్తాయి. ఈక్రమంలోనే కౌంటీల్లో ఆడుతూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IPL 2022, CSK Vs DC: ఐపీఎల్‌లో మరోసారి కరోనా కలకలం.. పాజిటివ్‌గా తేలిన బౌలర్.. సందిగ్ధంలో ఢిల్లీ-చెన్నై మ్యాచ్‌‌?

Ram Gopal Varma: మదర్స్ డే రోజు ఆర్జీవీ ట్వీట్ వైరల్.. విషెస్ చెప్తూనే ఇలా..

Rahul Gandhi: ఇప్పటి ధరకు అప్పట్లో రెండు గ్యాస్ సిలిండర్లు వచ్చేవి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఆగ్రహం..