5

Ram Gopal Varma: మదర్స్ డే రోజు ఆర్జీవీ ట్వీట్ వైరల్.. విషెస్ చెప్తూనే ఇలా..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన అది హాట్ టాపిక్కే .. ఏం చేసినా అది వైరలే..సందర్భం ఏదైనా వర్మ చేసే కామెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి.

Ram Gopal Varma: మదర్స్ డే రోజు ఆర్జీవీ ట్వీట్ వైరల్.. విషెస్ చెప్తూనే ఇలా..
Rgv
Follow us

|

Updated on: May 08, 2022 | 3:41 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏం చేసిన అది హాట్ టాపిక్కే .. ఏం చేసినా అది వైరలే..సందర్భం ఏదైనా వర్మ చేసే కామెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి.ఆయనను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. నేను ఎవ్వడికీ భయపడను.. అంతా నాఇష్టం ఆమె ధోరణిలో నడిచే వర్మ సినిమాలు కూడా అలానే ఉంటాయి. టాలీవుడ్ లో కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడ వర్మ పేరు వినిపిస్తుంది. మనసులో ఉన్న భావాలను ఎలాంటి దాపరికం లేకుండా, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం వర్మకు మాత్రేమే చెల్లుతుంది.ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా మాట్లాడే ఆర్జీవీ తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. ఇక ఆయన చేసే ట్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి వారైనా సరే ట్విట్టర్ వార్ కు దిగుతారు వర్మ. తాజా వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నెందు మదర్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తన తల్లి గురించి ట్వీట్ చేశారు. మాములుగా ట్వీట్ చేస్తే వర్మ ఎందుకవుతారు.. కనుక ఇలా ట్వీట్ చేశారు. “హ్యాపీ మదర్స్ డే మామ్. నేను మంచి కొడుకును కాదు. కానీ, ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ’’ అంటూ చేతిలో వోడ్కా గ్లాస్‌తో అమ్మ కాళ్లదగ్గర కూర్చొని ఫోటోకి ఫోజ్ ఇచ్చారు ఆర్జీవీ. ఇప్పుడు ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆర్జీవీ ట్వీట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..

T.Krishna: టీ. కృష్ణలు వేర్వేరు అని తెలియక కలగాపులగం చేసి పారేశారు

Prabhas: ప్రభాస్‌ కోసం మరో బాలీవుడ్‌ బ్యూటీని దింపుతోన్న చిత్ర యూనిట్‌.. అధికారిక ప్రకటన..