Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‌ కోసం మరో బాలీవుడ్‌ బ్యూటీని దింపుతోన్న చిత్ర యూనిట్‌.. అధికారిక ప్రకటన..

Prabhas: ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్‌ కే వర్కింగ్‌ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగ అశ్విన్‌ దర్శకత్వం..

Prabhas: ప్రభాస్‌ కోసం మరో బాలీవుడ్‌ బ్యూటీని దింపుతోన్న చిత్ర యూనిట్‌.. అధికారిక ప్రకటన..
Follow us
Narender Vaitla

|

Updated on: May 08, 2022 | 12:51 PM

Prabhas: ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్‌ కే వర్కింగ్‌ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగ అశ్విన్‌ దర్శకత్వం వహసిస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అశ్విన్‌ ఈ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైమ్‌ మిషన్‌ నేపథ్యంలో రానుందన్న వార్తలు కూడా అంచనాలు పెంచేశాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో నటీనటులు కూడా అదే రేంజ్‌లో ఉండేట్లు చూసుకుంటున్నాడు అశ్విన్‌.

ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం మరో బాలీవుడ్ నటిని మేకర్స్‌ తీసుకున్నారు. బాలీవుడ్‌ అందాల తార దిశాపటానీ ప్రాజెక్ట్‌కేలో నటించనుంది. ఈ విషయాన్ని దిశాపటానీ తానే స్వయంగా తెలిపింది.

చిత్ర యూనిట్‌ ‘ప్రాజెక్ట్‌ కె’లోకి ఆహ్వానిస్తూ ఇచ్చిన పుష్పగుచ్చం ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన దిశా.. ‘భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, ప్రభాస్‌ సినిమాలో నటించడం ఎందో ఆనందంగా ఉంది’ అంటూ కామెంట్‌ చేసింది. ఇదిలా ఉంటే సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్‌ కే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Disha Patani

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పింక్ కలర్ డ్రస్‌లో బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సుప్రీత..
పింక్ కలర్ డ్రస్‌లో బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సుప్రీత..
కొంటె చూపులు.. కవ్వించే నవ్వు..
కొంటె చూపులు.. కవ్వించే నవ్వు..
ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌బ్రేకింగ్‌ న్యూస్‌..!ఇవీ పరీక్షా రూల్స్
ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌బ్రేకింగ్‌ న్యూస్‌..!ఇవీ పరీక్షా రూల్స్
షమీ స్థానంలో డేంజరస్ పేసర్ ఎంట్రీ.. ప్లేయింగ్ 11లో కీలకమార్పు?
షమీ స్థానంలో డేంజరస్ పేసర్ ఎంట్రీ.. ప్లేయింగ్ 11లో కీలకమార్పు?
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్..
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్..
అందమైన ముఖం కోసం చక్కనైన చిట్కా..ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో
అందమైన ముఖం కోసం చక్కనైన చిట్కా..ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ రద్దయితే, భారత్‌ను ఢీ కొట్టేది ఎవరు?
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ రద్దయితే, భారత్‌ను ఢీ కొట్టేది ఎవరు?
పెను సమస్యగా ఊబకాయం.. పిల్లలు లావుగా మారడానికి కారణం అదేనట..
పెను సమస్యగా ఊబకాయం.. పిల్లలు లావుగా మారడానికి కారణం అదేనట..
ఆటలోనే కాదు.. అందంలోనూ అదరహో.. ఈ బ్లాక్ శారీ క్వీన్ ఎవరో తెలుసా?
ఆటలోనే కాదు.. అందంలోనూ అదరహో.. ఈ బ్లాక్ శారీ క్వీన్ ఎవరో తెలుసా?
రీ ఎంట్రీకి రెడీ అయిన క్రేజీ బ్యూటీ రంభ..
రీ ఎంట్రీకి రెడీ అయిన క్రేజీ బ్యూటీ రంభ..