Mahesh Babu: అభిమానులకు అలా చేయమంటూ మహేష్‌బాబు రిక్వెస్ట్‌.. సోషల్ మీడియాలో లేఖ వైరల్

మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్‌ చేస్తూ ఓ లేఖ రాశారు. 'సర్కారువారి పాట షూటింగ్‌ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది

Mahesh Babu: అభిమానులకు అలా చేయమంటూ మహేష్‌బాబు రిక్వెస్ట్‌.. సోషల్ మీడియాలో లేఖ వైరల్
Sarkari Vari Pata
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2022 | 10:53 AM

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ సర్కారువారి పాట (Sarkaru Vaari Paata) . ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ కు కనుల విందు చేయడానికి ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్‌ చేస్తూ ఓ లేఖ రాశారు. ‘సర్కారువారి పాట షూటింగ్‌ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారువారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ ఆనందాన్ని, అనుభూతిని తెలియజేయండి’ అంటూ లేఖలో రాసుకొచ్చారు.

అంతేకాదు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నిర్మించే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో మొదలవుతుందని నెక్ట్స్‌ సినిమా అప్‌డేట్‌ కూడా ఇచ్చారు మహేశ్‌. మొత్తానికి ఫ్యాన్స్‌ను తన సినిమాను థియేటర్లలోనే చూడమని చెప్తూ..తన కొత్త సినిమా గురించి గుడ్‌న్యూస్‌ చెప్పారు. మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి రాసిన ఈ లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు,  కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..