Sita Ramam : దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమానుంచి అందమైన వీడియో.. ఓ సీత హే రామ ప్రోమో
మోస్ట్ ప్రామిసింగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా సీతారామం. దుల్కర్ మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.
మోస్ట్ ప్రామిసింగ్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న సినిమా సీతారామం(Sita Ramam ). దుల్కర్ మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు దుల్కర్. ఈ సినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంది విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్. ఈ సినిమాలో శివాజీ గణేష్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు దుల్కర్. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేస్తున్నాడు. మద్రాస్ మిలిటరీ లిటిరేట్ అధికారిగా దుల్కర్ ప్రేమ కోసం ఎలా పోరాడాడు అని నేపథ్యంలో సినిమా ఉండనుంది.
తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన ప్రోమో ను రిలీజ్ చేశారు. ఓ సీత హే రామ అనే పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. కాశ్మీర్ లో జరిగిన ఓ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ రోజు విడుదలైన ప్రోమోలో జవాన్లనుంచి తప్పించుకుంటున్న కొందరు గ్రామస్థులను కాల్చి చెప్పినట్టు చూపించారు. ఆ తర్వాత దుల్కర్ ఒక సీసాలో బందించి ఉన్న సీతాకోక చిలుకలు విడుదల చేస్తూ.. వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేచుకోండి అని చెప్పడం ఆవి ఆ సీసాలోనుంచి బయటకు రావడం చూపించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :